Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

“అందం కోసం…..యువ‌తుల‌ను చంపి వారి ర‌క్తంతో స్నానం” ఈ దొర‌సాని గురించి తెలిస్తే షాక్ అవుతారు.!

Advertisement

ఎలిజ‌బెత్ బ‌థోరి… క్రూర‌త్వానికి ప్ర‌తీక‌. హంగేరీ రాజ కుటుంబంలో జ‌న్మించిన ఈమె చేసిన దురాగ‌తాలు అన్నీ ఇన్నీ కావు. త‌న సేవ‌కురాలు ఇచ్చిన కంప్లైంట్ తో అవ‌న్నీ ఒక్కొక్క‌టిగా బ‌య‌టిప‌డ్డాయి. ఆమె చేసిన ప‌నులు గురించి వింటే ఒక స్త్రీ ఇలా ఎలా ఆలోచించ‌గ‌లిగిందని ఆశ్చ‌ర్య‌మేస్తుంది.!

1560 లో పుట్టిన బ‌థోరి త‌న 15 వ యేట పెళ్లి చేసుకొని సెజ్తే అనే కోట‌లోకి ప్ర‌వేశించింది. ఆ కోట‌లో ప‌నిచేసే పేవ‌కుల‌ను, ఆ ప్రాంతంలోని రైతుల‌ను, త‌క్కువ త‌ర‌గ‌తి వారిని విప‌రీత‌మైన టార్చ‌ర్ కు గురిచేసేది.. అంద‌మైన యువ‌తుల‌ను చంపించి…వారి ర‌క్తంతో స్నానం చేసేది….అలా చేస్తే త‌న ఎప్ప‌టికీ అంద‌గా ఉంటాన‌న్న న‌మ్మ‌కంతో.!

Advertisement

 

  • అంద‌మైన అమ్మాయి కింది భాగానికి తేనే పూసి…చీమ‌ల‌ను, తేనెటీగ‌ల‌ను వ‌దిలేద‌ట‌!
  • పిన్నీసుల‌తో గోర్ల కింద గుచ్చేద‌ట‌!
  • భ‌ర్త చ‌నిపోయాక మ‌రింత‌గా రెచ్చిపోయిన బ‌థోరి… త‌న సేవ‌కుల‌ను ఇష్ట‌మున్న‌ట్లు కొరికేద‌ట‌.!
  • ఒక‌సారి ఓ సేవ‌కురాలి మాంసాన్ని కోసి…వండించి…ఆమె తోటే తినిపించింద‌ట‌!

Advertisements

బ‌థోరి 650 మందికి పైగా చంపింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అయితే న్యాయ‌స్థానం ముందు ఇవేవీ నిర్థార‌ణ కాలేదు. కార‌ణం ఆమె అత్యున్న‌త్త కుటుంబానికి చెందినామె కావ‌డం…దీనికి తోడు ఆమె బంధువులే రాజ్యం చేయ‌డం.

Advertisements