Advertisement
ఒక ఎడారి ప్రాంతం.. అక్కడ మీరు వాహనంలో ప్రయాణిస్తున్నారనుకుందాం. ఉన్నట్టుండి మీ వాహనం క్రాష్ అయింది. దీంతో అక్కడే మీరు స్ట్రక్ అయ్యారు. మరోవైపు అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం కూడా వేస్తుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు గనక ఉంటే ఏం చేస్తారు ? ఊహించాలంటేనే చాలా భయమవుతుంది కదా.. అవును.. అయితే ఆ వ్యక్తి కూడా నిజంగా సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కానీ అతను భయ పడలేదు. కొన్ని రోజులపాటు అక్కడ గడిపి చివరకు చాలా తెలివిగా అక్కడి నుంచి బయట పడ్డాడు. మరి అతను అందుకు ఏం చేశాడో తెలుసా..?
1993లో జరిగింది ఈ సంఘటన. అతని పేరు ఎమిలీ లెరే. వయస్సు 43 సంవత్సరాలు. మొరాకో ఎడారి ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్నాడు. ఉన్నట్టుండి కారు ప్రమాదానికి గురైంది. క్రాష్ అయింది. దీంతో అతను షాక్ తిన్నాడు. అసలే అది ఎడారి ప్రాంతం. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. మరోవైపు యాక్సిడెంట్‌లో కారు డ్యామేజీ అయింది. అటు వైపుగా ఎవరూ వచ్చే దాఖలాలు కూడా కనిపించడం లేదు. అలాంటప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలి.. ఇక్కడ చిక్కుకుపోయానే.. అనుకున్నాడు. దీంతో అతనికి మొదట ఏం చేయాలో తోచలేదు. కానీ చివరకు ఓ ఐడియా వచ్చింది.
Advertisement
ఎమిలీ నిజానికి ఓ ఎలక్ట్రిషియన్. ఆ రోజు ఎడారిలో అతను నడిపింది సిట్రొయెన్ 2సీవీ కారు. అది సడెన్‌గా క్రాష్ అవడంతో అతనికి ఏం చేయాలో తోచలేదు. కానీ వెంటనే ఐడియా రావడంతో ఆ కారును మోటార్ బైక్‌గా మార్చేశాడు. అయితే అందుకు అతని వద్ద ఎలాంటి పరికరాలు లేవు. అయినప్పటికీ 10 రోజుల పాటు అక్కడే ఉండి శ్రమించి క్రాష్ అయిన కారు నుంచి పలు పార్ట్‌లను తీసుకుని అతను మోటార్‌బైక్‌ను తయారు చేశాడు. చివరకు దానిపైనే ప్రయాణించి ఎట్టకేలకు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు.
Advertisements
ఎమిలీకి ఆ కారును మోటార్‌బైక్‌గా మార్చడానికి నిజానికి అతని వద్ద ఎలాంటి పరికరాలు లేవు. తన స్వహస్తాలతోనే దాన్ని అలా మార్చాడు. నిజంగా అది అద్బుతమనే చెప్పాలి. అసలు అలాంటి ప్రాంతంలో అలా చిక్కుకుపోవడమంటే.. అది ప్రాణాల మీదకు వచ్చినట్లే. కానీ అతను చాలా తెలివిగా ఆ కారును మోటార్‌బైక్ గా మార్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎలాంటి టూల్స్ లేకున్నా క్రాష్ అయిన కారు నుంచి పార్ట్‌లను తీసి మోటార్ బైక్‌గా మార్చడం.. అందులోనూ అలాంటి ప్రమాదకర ప్రాంతంలో 10 రోజుల పాటు ఒంటరిగా ఉండడం అంటే.. మాటలు కాదు.. అలాంటి స్థితిలో భయస్థులు ఉంటే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఎమిలీ మాత్రం అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కారును మోటార్‌బైక్‌గా మార్చి సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. అతని ధైర్యానికి, ప్రతిభకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.
Advertisements
అవును మరి.. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే… భయపడకుండా.. మైండ్‌తో ఆలోచిస్తే.. కచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. సమస్యల నుంచి బయట పడవచ్చు. అంతేకానీ.. అనవసరంగా భయపడితే సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి..!