Advertisement
మన దేశంలో సహజంగానే ఏదైనా రోడ్డును లేదా ఇతర ప్రాజెక్టులను, నిర్మాణాలను నిర్మించాలంటే అనేక అడ్డంకులు వస్తుంటాయి. ముఖ్యంగా సదరు నిర్మాణాలను చేపట్టేందుకు స్థలం కావల్సి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల కొందరు నష్టపరిహారం తీసుకుని తప్పుకునేందుకు ఒప్పుకోరు. దీంతో ఆ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో పడతాయి. ఫలితంగా జనాలకు కావల్సిన మౌలిక సదుపాయాలను అందించడం ఆలస్యమవుతుంది. అయితే చైనా అలా కాదు. అవును.. కింద ఇచ్చిన చిత్రాలను బట్టి చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఎలా అంటే..
Advertisements
చైనాలో ఏదైనా రహదారి లేదా ప్రాజెక్టు లేదా నిర్మాణం చేపట్టాలంటే వారు స్థలం కోసం ముందు, వెనుక ఆలోచించరు. ముందు నిర్మాణం కట్టేస్తారు. మధ్యలో ఏవైనా అడ్డు వస్తే దాన్ని వదిలి దాని చుట్టూ నిర్మాణం చేపడతారు. కింద ఇచ్చిన చిత్రాల్లోని కొన్ని రోడ్లను చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే ఆ తరువాత ఆ స్థల యజమానులు ఎలాగూ ఒప్పుకుని నష్టపరిహారం తీసుకుంటారు. ఇదీ.. చైనా ప్రభుత్వం తెలివి. ఇలా చేయడం వల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలు వెంటనే అందుతాయి. కాలక్రమంలో నిర్మాణాలకు అడ్డుగా ఉండే స్థల యజమానులు నష్ట పరిహారం తీసుకుని తప్పుకుంటారు. దీని వల్ల కోర్టు కేసులు, ఇతర సమస్యలు అస్సలు ఉండవు. చైనా ఈ ఫార్ములానే అనుసరిస్తూ అక్కడ అనేక నిర్మాణాలు చేపట్టింది. చేపడుతోంది. కింద ఇచ్చిన చిత్రాల్లో అదే స్పష్టమవుతుంది.
Advertisement
- కింద ఇచ్చిన చిత్రంలోని నిర్మాణం చైనా రాజధాని బీజింగ్‌లోనిది. 2002లో ఈ నిర్మాణం విలువ సుమారుగా 4.30 లక్షల చైనా యువాన్లుగా (దాదాపుగా రూ.46.87 లక్షలు) ఉండేది. కానీ అందుకు ఆ స్థలం యజమాని ఏకంగా 25 లక్షల యువాన్లు అడిగాడు.
- చైనాలోని చాంగ్ కింగ్ అనే ప్రాంతంలో ఇది ఉంది. ముందుగా రోడ్డు వేశారు. తరువాత 2006లో యజమాని ఒప్పుకోవడంతో అతనికి నష్ట పరిహారం చెల్లించారు.
- చైనాలోని వెన్‌లింగ్‌లో ఉన్న వెన్‌లింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నిర్మాణంది. రోడ్డు వేశాక కొంత కాలానికి యజమాని ఒప్పుకుని నష్ట పరిహారం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
- చిత్రంలో ఉన్న ఓ హైవే కింద ఓ నిర్మాణాన్ని గమనించవచ్చు. ఇది అక్కడి గువాంగ్ ఝౌ అనే ప్రాంతంలో ఉంది. ఆ నిర్మాణం యజమాని తనకు 40 లక్షల యువాన్లు కావాలని అడిగాడట. కానీ కొందరు మాత్రం అతను అక్కడి నుంచి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేశాడని చెబుతారు.
Advertisements