Advertisement
వివిధ రకాల నేరాలు చేసిన వారికి అనేక దేశాల్లో పలు రకాల శిక్షలను విధిస్తుంటారు. కొన్ని దేశాల్లో అయితే చిన్న నేరానికే మరణశిక్షపడుతుంది. ఇక పూర్వపు రోజుల్లో శిక్షలు ఇంకా భయంకరంగా ఉండేవి. వాటిని తలచుకుంటేనే వెన్నులో జలదరిస్తుంది. వణుకు పుడుతుంది. కింద చిత్రం కూడా సరిగ్గా అలాంటిదే. అది 1884 నాటి సంఘటనలను గుర్తు చేస్తుంది.
Advertisement
అప్పట్లో నేరాలకు పాల్పడిన వారిని దారుణంగా శిక్షించేవారు. ఫిరంగి గొట్టానికి ఎదురుగా నేరస్థుల వీపు వచ్చేలా వారిని గొట్టాలకు కట్టేసేవారు. అనంతరం ఫిరంగి గుండు పేల్చేవారు. దీంతో ఆ గుండు నేరస్థుల శరీరాలను ఛిద్రం చేసేది. వారి శరీర భాగాలు చెల్లా చెదురుగా పడేవి. తల ఎక్కడో దూరంగా 40 నుంచి 50 అడుగుల దూరంలో పడేది. చేతులు తెగి ఎడమది ఎడమ వైపు, కుడిది కుడి వైపుకు దూరంగా పడేవి. కాళ్లు తెగి కిందకు పడేవి. వీపు భాగం మొత్తం ఛిద్రమయ్యేది. శరీర అవశేషాలు కూడా మిగిలేవి కావు. అంత దారుణంగా అప్పట్లో శిక్షలు విధించేవారు.
అయితే ఇలాంటి దారుణమైన శిక్షలను 16, 17 శతాబ్దాల్లో ఎక్కువగా మొగల్ చక్రవర్తులు నేరస్థులకు విధించేవారు. ఎక్కువగా విప్లవకారులకు ఈ శిక్షలు పడేవి. రాజులకు వ్యతిరేకంగా మసలుకునే వారికి ఈ శిక్షలను ఎప్పటికప్పుడు అమలు పరిచేవారు. కానీ 20వ శతాబ్దంలో ఆ శిక్షలు తగ్గాయి. కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఈ శిక్షలను అమలు చేసేవారు. తరువాత రాజరికాలు అంతమవడంతో ఇలాంటి శిక్షలు కూడా లేకుండా పోయాయి.
Advertisements