Advertisement
కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా సరే వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు కదా… అలాంటిదే పెళ్లి చదివింపులలో 116, 516,1116 లాంటిది. ఇలా చివర్లో 16 వచ్చేటట్టు ఎందుకు చదివిస్తారు అనేది ఎవరికి అర్ధం కాదు. గుడిలో కూడా ఇలాంటివే మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ 16 వెనుక ఉండే రహస్యం ఏంటీ…? వాస్తవంగా మాట్లాడాలి అంటే… 100 ఇవ్వడమే సంప్రదాయం.
Also Read:అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?
Advertisement
నిజాం సంస్థానంలో వేరే రాజ్యాంగం అమలులో ఉండేది కాబట్టి వేరే నాణేలు వినియోగంలో ఉండేవట. అక్కడి రూపాయ ఆంధ్రా తదితర ప్రాంతాల వాళ్ల విలువను బట్టి చూస్తే… వంద రూపాయలు ఇస్తే అది 90 రూపాయలే అయ్యేదట. అందుకే నిజాం రాజ్యం లోని గద్వాల వంటి సంస్థానాల వాళ్లు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పండితులకు ఇక్కడి వందకు సరిపడే లెక్కగా అంటే —పండితులు అక్కడ ఇచ్చేది తక్కువ అనే భావన రాకుండా మరో 16 చేర్చి ఇచ్చే వారు.
Advertisements
వాళ్ల 116 రూపాయలు ఇతర ప్రాంతాల 100 రూపాయలకు సమానం. ఇదే 116 అనే ఆచారంగా స్థిరపడి… ఒకవేళ ఆ 16 లేకపోతే పక్క వారిని అప్పు అడిగి అయినా ఇస్తారు. ఒకవేళ అందుకు వీలు కాకపోతే 58 రూ. ఇవ్వడం కూడా ఆ విధంగా వచ్చిన ఆచారమే. నూట పదార్ల పద్ధతి అజ్ఞానమనే వాళ్ళు ఉన్నారు.
Advertisements