Advertisement
గత అయిదేళ్ళ నుంచి ఈ కామర్స్ సైట్స్ వాడకం బాగా పెరిగిన మాట వాస్తవం. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ను కనీసం నెలలో ఒకటి రెండు సార్లు అయినా వాడుతున్నారనే చెప్పాలి. చిన్న చిన్న అవసరాల నుంచి పెద్ద పెద్ద అవసరాల వరకు ఇప్పుడు వీటిని వాడుతున్నారు. అమెజాన్ వాడకం అయితే ఒక రేంజ్ లో ఉందనే చెప్పాలి. ఇక వీళ్ళకు లాభం ఏ విధంగా వస్తుంది అనేది చాలా మందికి తెలియదు.
Also Read:ఇండియన్ క్రికెట్ ను ఊపేసిన వివాదాలు ఇవే…!
Advertisement
సాధారణంగా ఇవి రెండు మల్టీ వెండర్ వెబ్సైట్లుగా చెప్పాలి. అంటే ఎంతమంది వ్యాపారులు అయినా వాళ్ళ వస్తువులను ఇందులో అమ్ముకునే అవకాశం ఉంటుంది. అందుకు గాను ప్రతి వెండర్ కొంత సబ్స్క్రిప్షన్ డబ్బు కడితే చాలు. ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి మంది వెండవర్స్ ఉంటే వాళ్ళు… వెయ్యి నుంచి రెండు వేల వరకు కడితే అమెజాన్ కు గాని ఫ్లిప్ కార్ట్ కు గాని ఎంత లాభం వస్తుంది…?
Advertisements
దానితో పాటుగా ప్రతీ అమ్మకానికి కొంత కమీషన్ కూడా ఇస్తూ ఉంటారు. 100 రూపాయల వస్తువుకి 1 శాతం కమిషన్ అనుకున్నా సరే వాళ్ళకు భారీగా రోజు కమీషన్ వస్తుంది. ప్రతీ రోజు వేలాది మంది వస్తువులను అమ్ముతున్నారు, కొంటున్నారు. ఇక అమెజాన్ prime, music, cloud services, వంటి ఇతర రంగాలలో కూడా ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెట్టేసింది.
Advertisements