Advertisement
సాధారణంగా డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, నిద్రలేమి సమస్య ఉన్నవారికి వైద్యులు నిద్రమాత్రలను రాస్తుంటారు. అయితే వాటిని కూడా డాక్టర్లు అంత సులభంగా ఏమీ రాయరు. పేషెంట్ స్థితి, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు.. తదితర అనేక వివరాలను వారు విచారించి.. పేషెంట్‌కు నిద్రమాత్రలు ఇవ్వాలా, వద్దా అని నిర్ణయం తీసుకుంటారు. ఆ మేర అవసరం అనుకుంటేనే పేషెంట్లకు నిద్రమాత్రలను ప్రిస్క్రైబ్ చేస్తారు. అయితే వాటిని వారు సాధారణంగా చాలా తక్కువ డోసులో కేవలం 1, 2 రోజులకు మాత్రమే 2 లేదా 3 ట్యాబెట్ల వరకు రాస్తారు. అంతకు మించి ఏ డాక్టర్ కూడా నిద్ర మాత్రలను ఎక్కువ సంఖ్యలో రాయరు. ఇక నిద్రమాత్రలను అమ్మే విషయంలో మెడికల్ షాపుల వారు కూడా పలు ప్రత్యేకమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
Advertisement
- పేషెంట్ వద్ద డాక్టర్ ఇచ్చిన మందుల చిట్టీ (ప్రిస్క్రిప్షన్) ఉంటేనే నిద్రమాత్రలను ఇవ్వాలి. ఇదే కాదు, అసలు ఏ మెడిసిన్ ఇవ్వాలన్నా.. పేషెంట్ వద్ద ఆ చిట్టీ తప్పనిసరిగా ఉండాలి.
- మెడికల్ షాపుల వారు ప్రత్యేకించి నిద్రమాత్రలకు చెందిన పేర్లను ఎట్టి పరిస్థితిలోనూ పేషెంట్లకు చెప్పరాదు. అలా చేయడం చట్ట విరుద్ధమవుతుంది. వారు శిక్షార్హులవుతారు.
- హైబీపీ సమస్య ఉన్నవారికి కొన్ని సందర్భాల్లో తక్కువ డోసు నిద్ర మాత్రలను ఇస్తారు. అయితే పేషెంట్ సరైన కారణాలను చూపిస్తే మెడికల్ షాపుల వారు అలాంటి మాత్రలను వారికి ఇవ్వవచ్చు. కానీ అవి చాలా తక్కువ డోస్ కలిగినవి అయి ఉండాలి.
- సైకాలజిస్టులు తమ పేషెంట్లకు నిద్రమాత్రలను ప్రిస్క్రైబ్ చేయరాదు. చేస్తే.. వారు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు.
- ఏ డాక్టర్ అయినా సరే పేషెంట్లకు చాలా స్ట్రాంగ్ నిద్ర మాత్రలను ప్రిస్క్రైబ్ చేయరాదు. కేవలం తక్కువ డోస్ కలిగిన ట్యాబ్లెట్లనే రాయాల్సి ఉంటుంది.
ఇక నిద్రమాత్రలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని ట్యాబ్లెట్లు మెదడులో పలు రసాయనాల విడుదలను ప్రోత్సహించి మెదడును రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. ఇక కొన్ని మెదడు పనితీరును నెమ్మదించేలా చేస్తాయి. దీంతో మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఈ క్రమంలో నిద్ర మత్తు వస్తుంది. మగతగా అనిపిస్తుంది. క్రమంగా నిద్ర వస్తుంది. అది కొంత సేపటికి గాఢ నిద్ర అవుతుంది. అయితే సాధారణంగా నిద్ర మాత్రలు రకాన్ని బట్టి కొన్ని ఎక్కువ సేపు ప్రభావం చూపుతాయి. కొన్ని చాలా తక్కువ సమయమే పనిచేస్తాయి. అయితే ఏ నిద్ర ట్యాబ్లెట్లు అయినా సరే.. మనం వాటిని మింగాక 30 నిమిషాల నుంచి 60 నిమిషాల్లో అవి పనిచేయడం ప్రారంభిస్తాయి. తరువాత 1 గంట లేదా 2 గంటలకు వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ టైముకు మనం నిద్ర పోకపోతే.. గాఢ నిద్ర వస్తుంది. ఇలా నిద్ర మాత్రలు పనిచేస్తాయి.
Advertisements
Advertisements