Advertisement
మన దేశంలో ఇప్పుడు దాదాపుగా అనేక రైల్వే స్టేషన్లలో ఉచితంగా ఇంటర్నెట్ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. భారతీయ రైల్వే సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ ద్వారా మనకు ఉచితంగా ఇంటర్నెట్‌ను అందిస్తోంది. దేశంలో దాదాపుగా 5వేల రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంది. రైల్వే స్టేషన్లలో వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేశారు. అందువల్ల ఇంటర్నెట్ కేవలం రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే మనకు లభిస్తుంది. అయితే ఇండియన్ రైల్వేస్ మనకు ఇచ్చే ఫ్రీ ఇంటర్నెట్ ఆ సంస్థకు ఎక్కడి నుంచి వస్తుంది ? అంటే…
సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు సముద్ర గర్భంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేస్తుంటారు. ఈ కేబుల్స్ వేసే కంపెనీలను టైర్ 1 కంపెనీలుగా వ్యవహరిస్తారు. వీటి నుంచి జియో, ఎయిర్‌టెల్, యాక్ట్ ఫైబర్ వంటి సంస్థలు నెట్‌వర్క్ తీసుకుని కేబుల్స్ వేసి మనకు ఇంటర్నెట్ ను అందిస్తాయి. అయితే అందుకు టైర్ 1 కంపెనీలకు ఆయా కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయి. ఇక గతంలో రైల్వే శాఖ వారు స్టేషన్లలో ఇంటర్నెట్‌ను అందించేందుకు BSNL పై ఆధారపడేవారు. జియో, ఎయిర్‌టెల్‌లాగే ఇది కూడా టైర్ 2 కంపెనీ. అందువల్ల రైల్వే చెల్లించే మొత్తం ఎక్కువగా ఉండేది.
Advertisement
అయితే రైల్వే శాఖ వారు టైర్ 1 కంపెనీగా ఉన్న గూగుల్‌తో భాగస్వామ్యం అయ్యారు. అందువల్ల ఖర్చు కలసి వస్తుంది. దీంతో గూగుల్‌కు ఇండియన్ రైల్వేస్ నేరుగా సొమ్ము చెల్లిస్తుంది. అందుకు గాను వారు రైల్వే స్టేషన్లను ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌తో కనెక్ట్ చేశారు. తరువాత నుంచి ఇంటర్నెట్‌ను అందించడం మొదలు పెట్టారు. ఇలా ఇండియన్ రైల్వేస్ మనకు ఇంటర్నెట్‌ను రైల్వే స్టేషన్లలో ఉచితంగా అందిస్తూ వస్తోంది.
Advertisements
Advertisements
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఇప్పటికే 45 వేల కిలోమీటర్ల మేర కేబుల్స్ వేశారు. ఆ కేబుల్స్‌తో 5వేల రైల్వే స్టేషన్లకు కనెక్టివిటీ ఇచ్చారు. దాంతో రైల్వే స్టేషన్లలో వైఫై హాట్ స్పాట్‌ల ద్వారా మనకు ఇంటర్నెట్ వస్తోంది. ఈ సేవలను మనకు ఇండియన్ రైల్వేస్, గూగుల్ సంస్థలు సంయుక్తంగా అందిస్తున్నాయి.