Advertisement
రైళ్లలో ప్రయాణికులకు సహజంగానే రక రకాల సదుపాయాలు లభిస్తాయి. వారు ప్రయాణించే రైలులోని బోగీలను బట్టి వారికి సదుపాయాలు ఉంటాయి. జనరల్, స్లీపర్, ఏసీ క్లాసుల్లో భిన్న రకాలుగా సౌకర్యాలను కల్పిస్తారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. రైళ్లను నడిపే లోకో పైలట్లకు, వారికి సహాయకులుగా ఉండే అసిస్టెంట్ లోకో పైలట్లకు రైలు ఇంజిన్‌లో మాత్రం టాయిలెట్లు ఉండవు. అవును నిజమే. వారికి టాయిలెట్ సౌకర్యం నిన్న మొన్నటి వరకు ఉండేది కాదు. కానీ ఎట్టకేలకు వారి పోరాటంతో రైలు ఇంజిన్లలోనూ వారికి సౌకర్యంగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
గతంలో అర్జెంట్ అయితే ఎం చేసేవారు.?
మూత్రం అయితే అక్కడే నిలబడి ఎలాగో ఓలా కనిచ్చేవారు. మలం అయితే నెక్ట్స్ స్టేషన్ వచ్చే వరకు ఎదురుచూసేవారు.! మరీ ఎమర్జెన్సీ అయితే పాలిథీన్ బ్యాగులను వాడాల్సి వచ్చేది.అయితే ఇంజిన్లలో టాయిలెట్లను ఎందుకు ఏర్పాటు చేయలేదంటే.. సహజంగా ఒక్క రైలుకు ఇద్దరు లోకో పైలట్లు ఉంటారు. ఒకరు లోకో పైలట్, మరొకరు అసిస్టెంట్ లోకో పైలట్. ఇద్దరిలో ఎవరైనా అవసరం లేకున్నా రెస్ట్ తీసుకునేందుకు టాయిలెట్‌కు వెళితే మరొకరిపై భారం పడుతుంది. అందుకనే గతంలో రైలు ఇంజిన్లలో టాయిలెట్ సౌకర్యం లేదు.
Advertisement
Advertisements
అయితే రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఉద్యమం చేయడంతో ఎట్టకేలకు 2016లో రైలు ఇంజిన్లలోనూ టాయిలెట్లను ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. అలా 2016 మే 6న టాయిలెట్ సౌకర్యం ఉన్న రైలు ఇంజిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో లోకో పైలట్లకు ఎంతగానో ఊరట కలిగింది. లేదంటే డయేరియా వంటి రోగాలతో ఎమర్జెన్సీ సమయాలప్పుడు వారు తీవ్రమైన ఇబ్బందులు పడి ఉండేవారు. కానీ 2016-17 బడ్జెట్‌లో ఇందుకు గాను ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో ఎట్టకేలకు ఇంజిన్లలో లోకో పైలట్లకు టాయిలెట్లను ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. ఆ టాయిలెట్లు వెస్టర్న్ శైలిలో ఎయిర్ కండిషన్డ్ వాక్యూమ్‌ను కలిగి ఉంటాయి. దీని వల్ల లోకో పైలట్లకు చాలా ఇబ్బందులు తప్పాయి.
Advertisements