Advertisement
మహాభారతం గురించి తెలిసిన ఎవరైనా కౌరవులు ఎంత మంది అంటే.. 100 మంది అని ఠక్కున సమాధానం చెబుతారు. పాండవులు 5 మంది.. కౌరవులు 100 మంది అని జవాబు ఇస్తారు. అయితే నిజానికి కౌరవులు 100 మంది కాదు.. 101 మంది.. అవును.. 100 మంది కుమారులతోపాటు గాంధారికి ఒక కుమార్తె జన్మిస్తుంది. అందుకనే కౌరవులు 101 మంది అయ్యారు.
గాంధారి ఒకసారి హస్తినాపురంలో అంతఃపురంలో ఉండగా వేద వ్యాసుడు అక్కడికి వస్తాడు. దీంతో గాంధారి ఆమెకు అన్ని సేవలు చేస్తుంది. ఆయన ఆశీస్సులు పొందుతుంది. అందుకు మెచ్చిన వ్యాసుడు ఆమెకు ఏదైనా వరం కోరుకోమని, అనుగ్రహిస్తానని చెబుతాడు. దీంతో గాంధారి తనకు 100 మంది పుత్రులు కావాలని.. అందరూ తన భర్త అంత శక్తి సామర్థ్యాలు కలవారు అయి ఉండాలని కోరుకుంటుంది. దీంతో వ్యాసుడు సరేనని వరం ఇచ్చి వెళ్లిపోతాడు.
Advertisement
తరువాత గాంధారి కొన్ని రోజులకు గర్భవతి అవుతుంది. అయితే ఆమె గర్భం ధరించి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కాన్పు రాదు. తరువాత కొంత కాలానికి ఆమె ప్రసవిస్తుంది. అయితే 100 మంది కాదు కదా.. కనీసం ఒక్క పుత్రుడు కూడా జన్మించడు. ఆమె ఓ మాంసం ముద్దకు జన్మనిస్తుంది. దీంతో కలత చెందిన గాంధారి ఆ ముద్దను పడేయాలని అనుకుంటుంది.
Advertisements
అయితే వ్యాసుడు వెంటనే ప్రత్యక్షమై గాంధారిని వారిస్తాడు. తాను వరం ఇచ్చాడు కనుక దాన్ని నెరవేర్చే బాధ్యత తనపై ఉందని చెప్పిన వ్యాసుడు 100 మట్టికుండలను తెమ్మంటాడు. అయితే గాంధారి తనకు 100 మంది పుత్రులతోపాటు ఒక కుమార్తె కూడా కావాలంటుంది. సరే.. అదనంగా ఇంకో కుండ.. మొత్తం కలిపి 101 కుండలను తెమ్మంటాడు. అందులో నెయ్యి పోయమని చెబుతాడు. గాంధారి అలాగే చేస్తుంది. తరువాత వ్యాసుడు ఆ మాంసం ముద్దను 101 భాగాలుగా విభజిస్తాడు. వాటిని ఆ కుండల్లో వేస్తాడు. దీంతో గాంధారికి 100 మంది పుత్రులు, 1 కుమార్తె సంతానం కలుగుతారు. అలా కౌరవులు 101 మంది అయ్యారు.
Advertisements