Advertisement
పాంచాల దేశాన్ని పాలించిన ద్రుపదరాజ కుమార్తె ద్రౌపది అన్న సంగతి తెలిసిందే. మత్య్స యంత్రాన్ని అర్జునుడు ఛేదించి ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాడు. తరువాత పాండవులందరూ ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే పాండవులను పెళ్లి చేసుకున్నాక ద్రౌపది ఒక్కొక్కరి ఇంట్లో ఏడాదిపాటు ఉంటుందని కొన్ని గ్రంథాల్లో రాశారు.
పాండవులను ఒకసారి కలిసిన నారదుడు వారికి సందుడు, ఉపసందుల కథ చెబుతాడు. సందుడు, ఉపసందుడు ఇద్దరూ కవలలు. వారు రాక్షస జాతికి చెందినవారు. అయితే ఇద్దరికీ ఒక వరం ఉంటుంది. ప్రపంచంలో ఎవరూ వారిని చంపలేరు. కానీ ఒకరికొకరు మాత్రమే చంపుకోవచ్చు. అయితే ఈ విధమైన వరం ఉండడం వల్ల ఇద్దరూ సర్వలోకాలకు వెళ్లి అందరినీ హింసిస్తుంటారు. అందుకు తాళలేని దేవతలు ఉపాయం ఆలోచించి ఆ ఇద్దరి వద్దకు తిలోత్తమను పంపుతారు.
Advertisement
తిలోత్తమ అందానికి ముగ్ధులైన సందుడు, ఉపసందుడు ఆమె నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటారు. చివరకు ఆమె కోసం ఇద్దరూ ఒకర్నొకరు చంపుకుంటారు. అలా వారి కథ ముగుస్తుంది. ఇదే కథను నారదుడు పాండవులకు చెబుతాడు. ఆ ఇద్దరు కవలలు ఎంతటి బలవంతులో తెలుసు కదా, అయినప్పటికీ ఒక స్త్రీ వల్ల ఆ ఇద్దరూ చనిపోయారు. కనుక అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే మీరు కూడా ద్రౌపది విషయంలో నియమం పెట్టుకోండి.. అని నారదుడు చెబుతాడు. దీంతో పాండవులు సరే అంటారు.
Advertisements
తరువాత పాండవులు ఒక నియమం పెట్టుకుంటారు. ద్రౌపది ఒకరి వద్ద ఉన్నప్పుడు మిగిలిన నలుగురిలో ఎవరూ ఆమె వద్దకు రాకూడదు. అయితే ఒకసారి అర్జునుడు ఒక బ్రాహ్మణుడికి సహాయం చేయదలిచి విల్లమ్ముల కోసం ధర్మరాజు వద్దకు వెళ్తాడు. అదే సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్ద ఉంటుంది. దీంతో నియమం తప్పానని చెప్పిన అర్జునుడు 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేస్తాడు.
Advertisements