Advertisement
ఇప్పుడంటే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనేక వాహనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కనుకనే మనం ఒక చోటి నుంచి మరొక చోటుకు ప్రయాణించడం చాలా తేలికవుతోంది. ఇక దేశాల మధ్య ప్రయాణం చేయడానికి విమానాలు కూడా ఉన్నాయి. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే మనం ఏకంగా కొన్ని దేశాలను దాటేస్తున్నాం. అయితే ఒకప్పుడు.. ఇతర దేశాలకు వెళ్లేందుకు ఎక్కువగా సముద్ర మార్గాన్నే ఆశ్రయించేవారు. అలాంటి సమయంలో ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు సముద్ర మార్గంలో ప్రయాణించేందుకు దాదాపు 30 రోజులు పట్టేదట!
4,5 భారీ ఓడలు ఒకేసారి ప్రయాణాన్ని మొదలు పెట్టేవట.! దీనికి కారణం భీకరమైన సముద్రంలో కాస్తంత ధైర్యం కోసం ఓడలన్నీ ఓకేసారి బయలు దేరేవట.! ఏదైనా ఓడకు ప్రమాదం జరిగితే సహాయం చేసే ముందు జాగ్రత్త నిమిత్తం…ఇలా బయలు దేరేవట!
Advertisement
అప్పట్లో బ్రిటీషర్స్ పరిపాలించే వాళ్లు కాబట్టి… ఆ దేశానికి మన దేశానికి మద్య రాకపోకలు బాగానే సాగేవట.! చదువు నిమిత్తం, వ్యాపారం నిమిత్తం! రెండో ప్రపంచ యుద్ద కాలంలో అయితే …..ఈ ప్రయాణాలు భయంభయంగా సాగేవట…ఎప్పుడు ఏ దేశం ఈ ఓడల మీద బాంబులు వేస్తారోఅనే భయంతో….! బ్రిటన్ కు చేరే క్రమంలో మద్యధరా సముద్రం వద్ద భీకరమైన అలలు వచ్చేవట! ఆ అలల ధాటికి ఓడలు ఊగేవట!అప్పటి ఓడల్లో హాస్పిటల్స్ , పిల్లలు స్పెషల్ ట్యూషన్ క్లాస్ లు కూడా ఏర్పాటు చేసేవారట!
Advertisements
ఈ రెండు దేశాల మద్య ఇప్పుటికీ ఓడలను నడుపుతున్నప్పటికీ …. ఎక్కువగా అవన్నీ ఎక్కువగా సరుకు రవాణాకు ఉపయోగిస్తున్నారు.! ప్యాసింజర్స్ ఓడలు ఉన్నాయి కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి.! అప్పటితో పోల్చితే ఇప్పుడు ఓడల్లో ఎంటర్ టైన్మెంట్ కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు! సరదాగా ట్రిప్ కోసమైతే వీటిని ఎంచుకుంటున్నారు.!
Advertisements