Advertisement
నాగయ్య…అంటే గుర్తుపట్టడం కష్టమేమో కానీ వేదం నాగయ్య అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు జనాలు.! వేదం సినిమా అతడి జీవితాన్నే మార్చేసింది. సిరిసిల్ల రాములుగా వేదం సినిమాలో అతని నటనకు 2010 నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ లభించింది!
రైతు నాగయ్యకు సినిమా అవకాశమెలా వచ్చింది?
నాగయ్యది గుంటూరు జిల్లా, నర్సరావుపేట వద్ద దేసవరంపేట. తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకునేవాడు….ఊరిలో పనులు లేకపోవడంతో కొడుకుతో పాటు కూలి పనుల నిమిత్తం హైద్రాబాద్ కు వచ్చాడు. ఓ రోజు హైద్రాబాద్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే……. ప్రొడ్యూసర్ రాధాకృష్ణ చూసి, అతడి ఆహార్యం నచ్చి సినిమాలో నటిస్తావా అని అడిగారు?తన ఆఫీస్ కు వచ్చిన నాగయ్య చేతిలో పెద్ద డైలాగ్ చీటి పెట్టి డైలాగ్ నేర్చుకోవాలని చెప్పారు. నాగయ్య ఆ డైలాగ్ అంతా గుక్కతిప్పుకోకుండా చెప్పడంతో వేదం సినిమాలో నాగయ్యకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుండి నాగయ్య వేదం నాగయ్యగా మారిపోయారు.
Advertisement
వేదంలో నాగయ్య నటనను మెచ్చి వరుస అవకాశాలొచ్చాయి! నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ ఇలా దాదాపు 25 సినిమాల్లో నటించాడు. సినిమా రేంజ్ ను బట్టి రోజుకు రూ.3వేల నుంచి రూ.25వేలవరకు రెమ్యునరేషన్ పొందేవారు.
Advertisements
ఫిల్మ్ నగర్ వీధుల్లో బిక్షమెత్తుకునే పరిస్థితి ఎందుకొచ్చింది!?
పరిస్థితి మారిందనుకునే సమయంలో నాగయ్య భార్య అనారోగ్యంతో చనిపోవడంతో, కొన్ని రోజులు ఇండస్ట్రీ కి దూరంగా ఉండాల్సి వచ్చింది… ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కుటుంబం గడవటం కష్టంగా మారింది…..మళ్లీ హైద్రాబాద్ వచ్చి ఎన్నో సినిమా ఆఫీసులు తిరిగినప్పటికీ అవకాశాలు రాలేదు! దీంతో కుటుంబ పోషణ కష్టమై…. ఫిల్మ్ నగర్ లో బిక్షాటన చేశారు.
Advertisements
నాగయ్య పరిస్థితిని మీడియాలో చూసి కేసిఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్నందించారు. మా అసోసియేషన్ కూడా నెలకు 2500 పించన్ ఇస్తున్నారు.!