Advertisement
నిత్యం మనం ఫోన్లలో ఉపయోగించే వాట్సాప్ యాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనే ఫీచర్ ఉంటుందనే సంగతి తెలిసిందే. దీని వల్ల అటు మెసేజ్ లను పంపేవారికి, ఇటు వాటిని అందుకునే వారికి తప్ప మిగిలిన ఎవరికీ ఆ మెసేజ్‌లు యాక్సెస్ కావు. సాక్షాత్తూ వాట్సాప్ కూడా ఆ మెసేజ్‌లను యాక్సెస్ చేయలేదు. వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ ఎప్పటి నుంచో ఈ విషయాన్ని చెబుతూ వస్తోంది. అయితే నటి రియా చక్రవర్తితోపాటు పలువురి ఫోన్లలో ఉన్న వాట్సాప్ డేటాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) యాక్సెస్ చేయగలిగింది. దీంతో వాట్సాప్ లో యూజర్ల డేటా భద్రతపై మరోసారి అనేక మందికి అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇంతకీ అసలు ఎన్‌సీబీ ఏ విధానం ద్వారా రియా చక్రవర్తి, ఇతరుల ఫోన్లలో ఉన్న వాట్సాప్ డేటాను యాక్సెస్ చేసింది.. అంటే…
ఎన్‌సీబీ అధికారులు ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో నటి రియా చక్రవర్తి సహా పలువురి ఫోన్లను క్లోన్ చేశారు. అంటే.. ఆ ఫోన్లను యథావిధిగా కాపీ చేసి అలాంటి ఫోన్లనే సృష్టించారన్నమాట. దీంతో వారి ఫోన్లలో ఉండే డేటా క్లోన్డ్ ఫోన్లలోకి వచ్చింది. ఈ క్రమంలో ఆ డేటాను నిపుణులు పలు మార్గాల్లో యాక్సెస్ చేశారు. ఫలితంగా వారి వాట్సాప్ చాట్‌లలో ఉన్న మెసేజ్‌ల వివరాలు, ఫొటోలు, ఇతర ఫైల్స్, కాల్ రికార్డ్స్ అన్నీ బయట పడ్డాయి.
Advertisement
అయితే వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంది కదా..? మరి దాని మాటేమిటి ? అది ఉంటే వాట్సాప్‌లో యూజర్ల డేటాను ఇతరులు యాక్సెస్ చేయలేరు కదా ? ఇది ఎలా సాధ్యమైంది ? అంటే.. అందుకు గల కారణాలను వాట్సాప్ వివరించింది.
సాధారణంగా మనం వాట్సాప్‌లో పంపుకునే మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటాయి. నిజమే. కానీ మనం వాట్సాప్ చాట్‌కు చెందిన డేటాను గూగుల్ డ్రైవ్ లేదా ఫోన్ లేదా యాపిల్ ఐక్లౌడ్‌లో బ్యాకప్ తీసుకుంటాం కదా. అది వాట్సాప్ సెక్యూరిటీ కిందకు రాదు. అందువల్ల దాన్ని ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు. సరిగ్గా ఎన్‌సీబీ అధికారులు కూడా ఇదే చేశారు. ముందుగా ఫోన్లను క్లోన్ చేసి వాటిని యాక్సెస్ చేశారు. అనంతరం అందులో ఉండే వాట్సాప్ డేటా బ్యాకప్‌లను గుర్తించారు. తరువాత వాటిని ప్రాసెస్ చేసి వాటిలో ఉండే డేటాను యాక్సెస్ చేశారు. దీంతో రియాచక్రవర్తితోపాటు సారా అలీ ఖాన్, దీపికా పదుకునే, రకుల్ ప్రీగ్ సింగ్, శ్రద్ధా కపూర్‌లకు చెందిన వాట్సాప్ చాట్ డేటా బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే వారు తమ చాట్‌లో డ్రగ్స్ ప్రస్తావన తెచ్చారు. అందుకనే ఎన్‌సీబీ వారిని విచారణకు పిలిచింది. ఇక వారికి చెందిన మేనేజర్లు, ఇతర సిబ్బందికి కూడా ఇందులో ప్రమేయం ఉందని తెలియడంతో ఎన్‌సీబీ వారిని కూడా విచారణకు పిలిచింది. ఇదీ.. అసలు విషయం..!
Advertisements
Advertisements