Advertisement
IPL 2020 లో ….. MI , DC, RCB, SRH టీమ్ లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి.! MI , DC, RCB టీమ్ లు ముందుగానే తమ ప్లే ఆఫ్ బెర్త్ లను కన్ఫార్మ్ చేసుకోగా…. SRH, MI మీద 10 వికెట్ల తేడాతో గెలిచి లేటుగా అయినా లేటెస్ట్ గా ప్లే ఆఫ్ లో అడుగుపెట్టి…. RCBతో పోరుకు సిద్దమైంది! వాస్తవానికి. SRH, RCB, KKR లు 14 మ్యాచులు ఆడి 7 మ్యాచ్ ల్లో విజయం సాధించాయి…కానీ SRH, RCB లు మాత్రమే ప్లే ఆఫ్ కు చేరుకొని, KKR ఇంటిబాట పట్టాల్సొచ్చింది. దీనికి కారణం నెట్ రన్ రేట్.! KKR తో పోల్చితే RCB, SRH ల నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం
ప్లే ఆఫ్ బెర్త్ నే డిసైడ్ చేసిన నెట్ రన్ రేట్ ను ఎలా లెక్కిస్తారో ఇప్పుడు చూద్దాం!
ఇక నెట్ రన్ రేట్ అంటే.. ఒక టోర్నమెంట్‌లో టీం ఆడిన వరుస మ్యాచ్‌లలో మొత్తం సాధించిన పరుగులు / మొత్తం ఎదుర్కొన్న ఓవర్లు.. విలువలోంచి మొత్తం ఇచ్చిన పరుగులు / మొత్తం వేసిన ఓవర్లు… విలువను తీసివేస్తారు. దీంతో నెట్ రన్ రేట్ వస్తుంది.
Advertisements
Advertisement
ఉదాహరణకు…
- ఒక టీమ్ 5 మ్యాచ్‌లలో 100 ఓవర్లు ఆడి మొత్తం కలిపి 800 పరుగులు చేసిందనుకుందాం. అలాగే ఆ టీం ప్రత్యర్థులకు అవే 5 టీ20 మ్యాచ్‌లలో 100 ఓవర్లు వేసి 700 పరుగులు ఇచ్చిందనుకుందాం.
నెట్ రన్ రేట్ = ( 800/100 ) – ( 700/100 )
= 8-7
=1.00
- అదే టీమ్ 5 మ్యాచ్‌లలో 100 ఓవర్లు ఆడి మొత్తం కలిపి 700 పరుగులు చేసి, ప్రత్యర్థి టీం కు … అవే 5 మ్యాచ్‌లలో 100 ఓవర్లు వేసి 800 పరుగులు ఇస్తే
Advertisements
నెట్ రన్ రేట్ = ( 700/100 ) – ( 800/100 )
= 7-8
= – 1.00
ఇక నెట్ రన్ రేట్‌ను లెక్కించే విషయంలో పలు ముఖ్యమైన అంశాలు కూడా ఉంటాయి. అంటే.. మ్యాచ్‌లో ఫలితం తేలకపోయినా, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా, కుదించబడినా.. ఇలా అనేక కారణాల వల్ల ఇరు జట్లు పూర్తి స్థాయిలో ఆడలేకపోయినా, ఇంకేమైనా కారణాల వల్లయినా సరే.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నెట్ రన్ రేట్‌ను ఆయా అంశాలకు అనుగుణంగా అంపైర్లు లెక్కిస్తారు. అందుకు ఐసీసీ రూల్ బుక్‌లో నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయి. కానీ ఏ టోర్నమెంట్‌లో అయినా సరే.. పైన తెలిపిన విధంగానే సహజంగా నెట్ రన్ రేట్‌ను లెక్కిస్తారు.