Advertisement
మొగల్ సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన మహారాణిగా నూర్జహాన్ పేరుగాంచింది. నిజానికి ఈమెది పర్షియా. ఈమె అందంలోనే కాదు.. తెలివితేటల్లోనూ గుర్తింపు పొందింది. అందువల్ల ఈమెను బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని పిలవవచ్చు. ఇక ఈమె అసలు పేరు మెహర్-ఉన్-నిసా. ఈమెకు 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు పర్షియా రాజు షెర్ అఫ్గన్ (అలీ కులీ)ని వివాహం చేసుకుంటుంది. వారికి ఒక కుమార్తె కూడా జన్మిస్తుంది. ఆమెకు లాడ్లీ బేగం అని పేరు పెడతారు.
అయితే అలీ కులీని జహంగీర్ చంపేస్తాడు. జహంగీర్ సోదరుడు కుతుబుద్దీన్ కోకాను అలీ కులీ చంపినందుకు గాను అతన్ని జహంగీర్ చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. తరువాత అలీ కులీ భార్యగా ఉన్న నూర్జహాన్ ఆగ్రాకు వస్తుంది. అక్కడ అక్బర్ భార్య, మహారాణి రుకయియా సుల్తాన్ బేగం కొలువులో పనిచేస్తుంటుంది. రుకయియా సుల్తాన్ బేగం సలీంకు సవతి తల్లి అవుతుంది. రుకయియా కొలువులో ఉన్న నూర్జహాన్ మహారాణి రుకయియాతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంది. రుకయియాకు కూడా నూర్జహాన్ అంటే ఇష్టం ఉండేది. ఆమెను కూతురిలా మహారాణి చూసుకునేది.
Advertisement
ఒక రోజు మీనా బజార్‌లో రుకయియాతో ఉన్న నూర్జహాన్‌ను జహంగీర్ చూస్తాడు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరుతాడు. అందుకు నూర్జహాన్ సరేనని చెబుతుంది. రుకయియా కూడా అందుకు సమ్మతిస్తుంది. దీంతో ఆ ఇద్దరి వివాహం జరుగుతుంది. తరువాత 1620వ సంవత్సరంలో నూర్జహాన్ మొగల్ సామ్రాజ్యానికి మహారాణి అవుతుంది. జహంగీర్‌కు అంతకు ముందు ఉన్న భార్య సలేహా బానో చనిపోయాక ఆమె స్థానంలో నూర్జహాన్ మహారాణి అవుతుంది. ఆమె పాద్‌షా బేగంగా కొనసాగుతుంది.
నూర్జహాన్ మహారాణి అయ్యాక ఆమె మొగల్ సామ్రాజ్యంపై సర్వాధికారాలను పొందుతుంది. దీంతో రాజ్యం కోసం దాదాపుగా అన్ని నిర్ణయాలనూ ఆమే తీసుకుంటుంది. తనకు ఇష్టం ఉన్న మంత్రులను నియమించేది. ఫర్మానాలను జారీ చేసేది. తన పేరిట నాణేలను కూడా ముద్రించింది. అలాగే తన తండ్రి ఇంతియాడ్ దౌలా, సోదరుడు అసఫ్ ఖాన్, షాజహాన్, తన తల్లి అస్మత్ బేగం, ఇతర మంత్రులతో కలిసి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. వారందరితో కలిసి రాజ్యపాలన అంశాల్లో ఆమె నిర్ణయాలు తీసుకునేది.
Advertisements
నూర్జహాన్‌కు ఆర్కిటెక్చర్ అంటే ఇష్టం ఉండేది. దీంతో ఆమె అనేక తోటలు, సమాధులు, బావులను నిర్మించింది. దుస్తులను డిజైన్ చేయడం అన్నా ఆమెకు ఇష్టమే. ఇతర్-ఇ-జహంగిరి అనే కొత్త పెర్‌ఫ్యూంను కూడా ఆమె తయారు చేసింది. అలాగే రోజ్ ఇత్రాను కూడా ఆమే కొత్తగా తయారు చేసింది. ఆమెకు కవిత్వంలోనూ పరిచయం ఉండేది. పలు కవితలను కూడా రాసింది. అనేక మంది రాజ కుటుంబీకులకు ఆమే వివాహాలు దగ్గరుండి కుదిర్చేది. ఈ క్రమంలో నూర్జహాన్ మొగల్ సామ్రాజ్యంలోనే అత్యంత శక్తివంతమైన మహారాణిగా గుర్తింపు పొందింది.
Advertisements