Advertisement
JIO… ఇండియాలో అతి ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికిన బ్రాండ్.! 2016లో ప్రారంభమైన JIO ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 మొబైల్ నెట్ వర్క్ కంపెనీ. హిస్టరీనే క్రియేట్ చేసిన JIO పేరు పుట్టుక యాధృచ్చికంగా జరిగిందట.!
ఓ రోజు రాత్రి…అంబానీ తాను పెట్టాలనుకున్న టెలికమ్యూనికేషన్ కు ఓ మంచి పేరు కోసం ఆలోచిస్తున్నారట.! ఈ సమయంలో ఓ పేపర్ తీసుకొని తన వృద్ధికి ప్రధాన కారణమైన OIL బిజినెస్ లోని OIL అనే అక్షరాలను పేపర్ మీద రాశాడట….ఆలోచిస్తూ ఆలోచిస్తూ పేపర్ తిప్పాడట….అక్కడ ఓ కొత్త పదాన్ని ఏర్పడడం చూసి..ఆశ్చర్యపోయి అదే పేరును తన కొత్త బిజినెస్ కు పెట్టాడట.! ( నిజమో అబద్దమో కానీ…అన్ని యాజ్ ఇట్ ఈస్ సింక్ అయిపోయాయి- కొన్ని ఐడియాలు అంతే ఇలాగే పుట్టుకొస్తాయ్)

పేపర్ మీద రాసింది.

పేపర్ తీప్పినప్పుడు కనిపించింది!
కూతురి ఆలోచన:
సెప్టెంబర్ -2016 లో అంబానీ తన కొత్త బిజినెస్ JIO ను ఇంట్రడ్యూజ్ చేస్తూ కూతురి ఆలోచనల నుండి ఈ కాన్సెప్ట్ పుట్టిందని తెలిపాడు . 2011 లో కూతురు అమెరికాలోని యేల్స్ యూనివర్సిటీలో చదువుకునేదని…సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు …ఆన్ లైన్ లో తన అసైన్మెంట్స్ సబ్మిట్ చేసే సమయంలో ఇంటర్నెట్ చిరాకు తెప్పించడంతో …ఈ ఆలోచన తనలో కలిగిందని…ఆ ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చిందని చెప్పాడు.!
Advertisement
JIO క్రేజ్ కు కారణమేంటి? :
మాట్లాడుకోవడానికి చెల్లించక్కర్లేదు.. డేటాకు మాత్రమే చెల్లించండి ఇదీ రిలయన్స్ జియో వ్యాపార సూత్రం. దీని కోసం JIO -Voice over Long-Term Evolution (VoLTE) అనే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. దీని కారణంగా మాటలు సైతం డేటా రూపంలోకి మారి వివిధ మార్గాల్లో రిసీవర్ ఫోన్‌కు చేరుతాయి. అక్కడికి చేరాక, ఆ డేటా ప్యాకెట్లన్నీ ఒకటిగా మారి మాట రూపంలో వినిపిస్తాయి. దీని కారణంగా వాయిస్ ను సైతం డేటాకు కన్వర్ట్ చేయగలిగారు. టెలికామ్ రంగంలో ఓ విప్లవానికి నాంది పలికారు.
Advertisements
Advertisements