Advertisement
సాధారణంగా ఏ రైలు అయినా సరే.. ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్‌కు (ఆరంభం నుంచి చివరి వరకు) ప్రయాణిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక్కో రైలు దాని కెపాసిటీని, విభాగాన్ని బట్టి నిర్దిష్టమైన కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కొన్ని ఎక్కువ దూరం, కొన్ని తక్కువ దూరం ప్రయాణిస్తాయి.. అంతే తేడా.. అయితే ఏ రైలు అయినా సరే.. గమ్యస్థానానికి చేరాక మళ్లీ అక్కడి నుంచి బయల్దేరి మరొక చివరన ఉన్న గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ క్రమంలో రైళ్లకు ఇంజిన్లను మారుస్తారు. అవి దిశను మార్చుకుంటాయి. కొన్ని మార్గాలను మార్చుకుంటాయి. అయితే రైలు ఇంజిన్ల దిశను ఎలా మారుస్తారనేది ఇప్పటికీ చాలా మందికి తెలియదు. నేరుగా వెళ్లే రైలును దిశ మార్చి మళ్లీ రివర్స్‌లో ఎలా తీసుకువస్తారు ? ఇంజిన్‌ను ఎలా మారుస్తారు ? అనే విషయాలు అనేక మందికి తెలియవు. అదెలాగో కింద ఇచ్చిన చిత్రం చూసి తెలుసుకోవచ్చు.
Advertisement
చిత్రంలో గమనించారా.. పట్టాలపై ఉన్న ఇంజిన్‌ను దారి మళ్లిస్తున్నారు. పక్కనే గుంతలాంటి నిర్మాణం ఉంది. దాని పక్కనే ఓ వ్యక్తి ఒక పొడవైన హ్యాండిల్‌ను పట్టుకుని ఉన్నాడు. ఆ హ్యాండిల్‌ను తిప్పగానే రైలు దిశ మారుతుంది. కింది భాగంలో ఒక బాల్ బేరింగ్‌ను అమరుస్తారు. అది ఇంజిన్‌ను తిప్పేందుకు ఉపయోగపడుతుంది. ఇంజిన్ దిశ మారగానే ఆ బాల్ బేరింగ్‌ను తీసేసి మళ్లీ ఇంజిన్‌కు అమరుస్తారు. ఇలా స్టేషన్లలో ఇంజిన్‌ను రైలు నుంచి విడదీసి దాని దిశను మార్చి మళ్లీ రైలుకు ఇంకోవైపుకు దాన్ని తెచ్చి తగిలిస్తారు. ఇక కొన్ని రైళ్లకు మాత్రం రెండు ఇంజిన్లు ఉంటాయి. అందువల్ల వాటి దిశలను మార్చాల్సిన అవసరం ఉండదు. ఒక వైపు వెళ్లేటప్పుడు ఒక ఇంజిన్, మరొక వైపు వెళ్లేటప్పుడు మరొక ఇంజిన్ ఉపయోగపడతాయి.
Advertisements
Advertisements
అయితే రైలు ఇంజిన్‌ల దిశలను మార్చేందుకు ఉపయోగించే ఆ గుంతలాంటి నిర్మాణాన్ని టర్న్‌టేబుల్ (turn table) అంటారు. చూసేందుకు ఇది చాలా సింపుల్‌గానే ఉంటుంది. కానీ దీంతో భారీ ఇంజిన్‌ల దిశ మారుస్తారు. సాధారణంగా ఈ నిర్మాణాలు స్టేషన్లకు చాలా దూరంలో ఉంటాయి. అందువల్ల ఇవి దాదాపుగా చాలా మందికి కనిపించవు.