Advertisement
రామాయణంలో రావణుడు పుష్పక విమానాన్ని వాడుతాడని రాసి ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే రావణుడు ఆ విమానాన్ని ఎలా తయారు చేయించాడు ? అంటే.. నిజానికి అసలు ఆ విమానం రావణుడిది కాదు. బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ ముందుగా ఆ విమానాన్ని తయారు చేసి ఇచ్చాడు. తరువాత అది కుబేరుడి వద్దకు చేరుతుంది.
అయితే కుబేరుడితో రావణుడు యుద్ధం చేసి గెలుస్తాడు. దీంతో రావణుడు ఆ పుష్పక విమానాన్ని తన వశం చేసుకుని దాన్ని ఉపయోగిస్తుంటాడు. ఇక యుద్ధంలో రావణున్ని రాముడు చంపేశాక ఆ విమానం రావణుడి తమ్ముడు విభీషణుడికి సొంతం అవుతుంది. కానీ అతను దాన్ని రాముడికి ఇచ్చేస్తాడు.
Advertisement
Advertisements
రాముడు యుద్ధం అనంతరం ఆ పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకుంటాడు. తరువాత దాన్ని రాముడు తిరిగి కుబేరుడికి ఇచ్చేస్తాడు. అందువల్ల ఆ విమానం అప్పటి నుంచి కుబేరుడి వద్దే ఉంది. అయితే పుష్పక విమానంలో ఎంత ఎంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుందని చెబుతారు. దాన్ని అత్యంత విలువైన రత్నాలు, లోహాలతో విశ్వకర్మ తయారు చేశాడు. అందువల్ల పుష్పక విమానం వెలకట్టడం కూడా అసాధ్యమని చెప్పవచ్చు. రామాయణంలో మనకు అనేక చోట్ల పుష్పక విమానం ప్రస్తావన కనిపిస్తుంది.
Advertisements