Advertisement
ప్రస్తుతం మార్కెట్‌లో కేవలం ప్రీమియం రేంజ్‌లో ఉండే స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల నీళ్లల్లో పడ్డా.. వర్షంలో తడిసినా.. వాటికి ఏమీ కాదు. కానీ అంతకన్నా కిందిస్థాయిలో ఉండే ఫోన్లు మాత్రం నీళ్లలో పడితే పనిచేయవు. అలాగే అవి వర్షంలో తడిసినా సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితిలో చాలా మంది ఫోన్‌ను ఏ పార్ట్‌కు ఆ పార్టు విడదీసి బ్యాటరీ తొలగించి ఆ ఫోన్‌ను, ఇతర భాగాలను బియ్యంలో కప్పి పెడతారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు ? ఇలా చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ? అంటే…
తడిసిన ఫోన్, దాని భాగాలను బియ్యంలో కప్పి ఉంచడం వల్ల వాటిలో ఉండే తేమను బియ్యం శోషించుకుంటుంది. బియ్యం ఉత్తమమైన Hygroscopic ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంటే.. తేమను పీల్చుకునే పదార్థం అన్నమాట. అయితే ఏదైనా ఒక సంచిలో లేదా బాక్సులో, కంటెయినర్‌లో ఉన్న బియ్యం అయితేనే ఆయా పార్టుల నుంచి తేమను త్వరగా గ్రహిస్తుంది. దీంతో ఆ పార్ట్‌లు త్వరగా పొడిగా మారుతాయి. అదే ఓపెన్‌గా ఉన్న బియ్యం అయితే అప్పటికే వాతావరణంలోని తేమను గ్రహించి ఉంటుంది కనుక అలాంటి బియ్యంలో ఫోన్ పార్టులను ఉంచరాదు. బియ్యం ఎంత పొడిగా ఉంటే.. అందులో ఉంచే ఫోన్ పార్టులు అంత త్వరగా పొడిగా మారుతాయి.
Advertisements
Advertisement
అయితే ఫోన్లు నీటిలో పడినా, వర్షంలో తడిసినా వాటిని వీలైనంత వరకు వెంటనే టెక్నిషియన్‌కు అందజేయాలి. వారి వద్ద ఉండే హీటింగ్ పరికరాలు, ఇతర ద్రావణాలతో ఫోన్‌కు ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. అదే వారు అందుబాటులో లేరనుకుంటేనే అలా పైన చెప్పిన విధంగా ఫోన్ పార్టులను తీసి బియ్యంలో ఉంచాలి. దీంతో 2-3 రోజుల పాటు వాటిని అలా ఉంచితే అవి పూర్తిగా పొడిగా మారుతాయి. అయితే బియ్యంకు బదులుగా సిలికా జెల్ వాడవచ్చు. ఇది మనకు సహజంగానే ఎలక్ట్రానిక్స్, ఇతర పరికరాలతోపాటు, ఆహార పదార్థాల్లో చిన్న చిన్న ప్యాకెట్లలో వస్తుంది. కానీ దాని కన్నా మార్కెట్‌లో సిలికా జెల్ ప్యాకెట్లను కొని వాడింది మేలు. అలా కుదరకపోతే ఆయా ప్యాకింగ్‌లలో ఉండే సిలికా జెల్ ప్యాకెట్లను ఓవెన్‌లలో వేసి వేడి చేసి వాటిని ఫోన్ పార్టులను పొడి చేసేందుకు ఉపయోగించవచ్చు. సిలికా జెల్ ప్యాకెట్లను, ఫోన్ భాగాలను కలిపి ఓ బాక్సులో వేసి ఉంచితే చాలా తక్కువ సమయంలో ఆ పార్టుల్లోని తేమను ఆ జెల్ పీల్చుకుంటుంది. దీంతో అవి పొడిగా మారుతాయి.
Advertisements
ఇక ఫోన్‌లో బ్యాటరీ కాకుండా మదర్‌బోర్డ్ వంటి భాగాలపై స్పిరిట్‌ను అప్లై చేసి టూత్‌బ్రష్‌తో బాగా క్లీన్ చేస్తే.. తేమ పోతుంది. తరువాత వాటిని పొడి వాతావరణంలో ఉంచి ఆరబెట్టాలి. పూర్తిగా డ్రై అయ్యాక వాటిని ఫోన్‌లో అమర్చాలి. బ్యాటరీ కూడా పూర్తిగా పొడిగా అయిందని నిర్దారించుకున్నాకే ఫోన్‌లో అమర్చాలి. దీంతో నీటిలో తడిసిన ఫోన్‌ను.. టెక్నిషియన్ అవసరం లేకుండానే.. ఎవరైనా సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు. అయితే తప్పదనుకుంటేనే సొంతంగా ట్రై చేయండి.. వీలైనంత వరకు టెక్నిషియన్ వద్దకు వెళ్లిందే ఉత్తమం.. ఫోన్‌ను హ్యాండిల్ చేసే టెక్నిక్స్ ఎంతైనా మనకన్నా వారికే బాగా తెలుస్తాయి కదా..!