Advertisement
ఈ ఫొటో గుర్తుందా..? 2016లో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అస్థిపంజరం లాంటి శరీరంతో అత్యంత హృదయ విదారకంగా కనిపిస్తున్న ఆ బాలున్ని చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. అయ్యో.. అంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ బాలుడికి ఆ మహిళ నీళ్లు తాగిస్తూ.. బిస్కెట్లు తినిపిస్తూ.. ఫొటోలో మనకు కనిపించింది. కట్ చేస్తే.. ఇంకో ఫొటో.. 4 ఏళ్లు గడిచాయి.. చూడండి ఆ బాలుడిలో ఎంత మార్పు వచ్చిందో.. నిజంగా అద్భుతంగా ఉంది కదా.. అవును.. విశేషమే మరి.. అయితే ఈ ఘనత అంతా ఆ ఫొటోలో ఉన్న మహిళకు, ఆమె భర్తకు దక్కుతుంది.
Advertisement
ఆమె పేరు అంజా రింగ్రెన్ లొవెన్. ఆమె భర్త పేరు డేవిడ్ ఎమ్మాన్యుయెల్ ఉమెమ్. వీరిది డెన్మార్క్. ఇద్దరూ సామాజిక కార్యకర్తలే. వీరిద్దరూ అప్పట్లో అలాంటి అనాథ పిల్లల కోసం ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఏసీఏఈడీఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే వారు అప్పట్లో నైజీరియాలో పర్యటిస్తూ చిత్రంలో చూపిన బాలున్ని కలుసుకున్నారు. అతన్ని చూసి వారు చలించిపోయారు. వెంటనే అతనికి నీళ్లు, ఆహారం అందజేశారు. తరువాత అతనితోపాటు అతనిలాంటి మరికొంత మందిని తమతో తీసుకెళ్లి తమ సేవా సంస్థలో వారిని పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఆ బాలుడు ఇప్పుడు అందరు పిల్లల్లాగే ఎదిగి ముద్దుగా కనిపిస్తున్నాడు. ఇదంతా ఆ దంపతుల చలవే.
ఇక ఆ బాలున్ని ఇప్పుడు వారు హోప్ అని పిలుస్తున్నారు. నిత్యం సేవా సంస్థలో ఆ దంపతులు ఆ పిల్లలతో సరదాగా గడపడమే కాదు.. దాతలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు అందజేసే నిధుల సహాయంతో అలాంటి ఎంతో మంది ఆఫ్రికన్ చిన్నారులను రక్షించి తీసుకువచ్చి వారికి అండగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా.. ఆ దంపతులు చేస్తున్న సేవలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
Advertisements
Advertisements