Advertisement
కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన దేశంలోని వీధి వ్యాపారులకు మళ్లీ ఉపాధి కల్పించేందుకు గాను ప్రధాని మోదీ ప్రభుత్వం వారికి రూ.10వేల రుణాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం స్వనిధి పథకం కింద ఆ రుణాన్ని అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఈ పథకాన్ని జూలై 2వ తేదీన ప్రారంభించగా.. ఇప్పటి వరకు ఈ స్కీం కింద 15,96,089 మంది దరఖాస్తు చేసుకున్నారు. 5,87,241 మందికి రుణాలను మంజూరు చేశారు. రూ.587 కోట్లను వీధి వ్యాపారుల అకౌంట్లలో రుణం కింద జమ చేశారు. అయితే పీఎం స్వనిధి వెబ్‌సైట్‌లో వీధి వ్యాపారులు ఎవరైనా సరే సులభంగా లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. అదెలాగంటే…
స్టెప్ 1: పీఎం స్వనిధి పోర్టల్ http://pmsvanidhi.mohua.gov.in/ ను ఓపెన్ చేయాలి.
స్టెప్ 2: లబ్ధిదారులు తమ మొబైల్ నంబర్‌ను పైన తెలిపిన సైట్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత I am not a robot అనే బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రిక్వెస్ట్ ఓటీపీ అనే బటన్‌పై క్లిక్ చేసి ముందుకు సాగాలి.
స్టెప్ 3: మొబైల్ నంబర్‌కు 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని సైట్‌లో ఎంటర్ చేయాలి. తరువాత వెరిఫై ఓటీపీ అనే బటన్‌పై క్లిక్ చేసి ఓటీపీని కన్ఫాం చేయాలి. అనంతరం ఇంకో విభాగం దర్శనమిస్తుంది.
Advertisements
స్టెప్ 4: అందులో ఏదైనా ఒక కేటగిరిని ఎంపిక చేసుకోవాలి.
స్టెప్ 5: స‌్ట్రీట్ వెండార్ కేటగిరి ఎ ను సెలెక్ట్ చేస్తే ఎస్ఆర్ఎన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే డోన్ట్ హావ్ ఎస్ఆర్ఎన్ ? ఫైండ్ హియర్ అనే బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 6: ఎస్ఆర్ఎన్ కోసం రాష్ట్రం సెలెక్ట్ చేయాలి. తరువాత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 7: ఎస్ఆర్ఎన్ నంబర్ గ్రీన్ కలర్‌లో దర్శనమిస్తుంది. దాన్ని కాపీ చేయాలి.
స్టెప్ 8: ముందు ట్యాబ్‌లో ఎస్ఆర్ఎన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం సెర్చ్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 9: ఎస్ఆర్ఎన్ నంబర్‌తోపాటు స్ట్రీట్ వెండార్ వివరాలు దర్శనమిస్తాయి. వివరాలను ఒకసారి పరిశీలించాలి. ఓకే అనుకుంటే కన్ఫాం చేయాలి.
స్టెప్ 10: ఐడీ కార్డ్, సర్టిఫికెట్ ఆఫ్ వెండింగ్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాలి. లోన్‌కు చెందిన దరఖాస్తు ఫాం ఓపెన్ అవుతుంది.
స్టెప్ 11: స‌్ట్రీట్ వెండార్ కేటగిరి బి ని సెలెక్ట్ చేస్తే ఎస్ఆర్ఎన్ నంబర్ ను ఎంచుకోవాలి. ఎస్ఆర్ఎన్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి. అయితే ఎస్ఆర్ఎన్ నంబర్ తెలియకపోతే పైన తెలిపిన విధంగా 5, 7 స్టెప్‌లను అనుసరించాలి.
Advertisement
స్టెప్ 12: ఎస్ఆర్ఎన్ నంబర్‌తోపాటు స్ట్రీట్ వెండార్ వివరాలు దర్శనమిస్తాయి. వివరాలను పరిశీలించి ఓకే అనుకుంటే కన్‌ఫాం చేసుకోవాలి. అనంతరం నెక్ట్స్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. దీంతో లోన్ దరఖాస్తు ఫాం ఓపెన్ అవుతుంది.
స్టెప్ 13: అయితే కేటగిరి సి లేదా డి లను సెలెక్ట్ చేస్తే లెటర్ ఆఫ్ రికమండేషన్ సమర్పించాలి.
స్టెప్ 14 A(i): లెటర్ ఆఫ్ రికమండేషన్ ఉంటే I have been issue Letter of Recommendation (LoR) by ULB/TVC అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 14 A(ii): లెటర్ ఆఫ్ రికమండేషన్ ను అప్‌లోడ్ చేసిన తరువాత నెక్ట్స్ అనే బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో లోన్ అప్లికేషన్ ఫాం వస్తుంది.
స్టెప్ 14 B (i): లెటర్ ఆఫ్ రికమండేషన్ లేకుంటే I have NOT been issue Letter of Recommendation (LoR) by ULB/TVC అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 14 B(ii): అనంతరం అందులో పలు ఆప్షన్లు ఉంటాయి. వాటిని ఎంపిక చేసుకోవాలి. తరువాత నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో లోన్ అప్లికేషన్ ఫాం వస్తుంది.
స్టెప్ 15: ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి I am not Robot అనే బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం వెరిఫై పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 16: ఆధార్ నంబర్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయాలి.
స్టెప్ 17: స‌్ట్రీట్ వెండార్ సర్వే ఫార్మాట్ నింపాలి. అనంతరం డిజిటల్ పేమెంట్ వివరాలను నమోదు చేయాలి. ఆ వివరాలు లేకుంటే No అనే బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఫాంను నింపిన తరువాత సబ్‌మిట్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 18: అనంతరం వచ్చే ఆప్షన్లలో బ్యాంక్, బ్రాంచ్ ను ఎంపిక చేయాలి. తరువాత ఫాంను సేవ్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 19: లబ్ధిదారుడి ఫోన్ నంబర్‌కు తన లోన్‌కు చెందిన అప్లికేషన్ నంబర్ ను మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఆ నంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎవరైనా దాని గురించి ఆ తరువాత అడిగితే వారికి ఆ నంబర్‌ను చెప్పాల్సి ఉంటుంది.
ఇలా వీధి వ్యాపారులు రూ.10వేల పీఎం స్వనిధి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా దరఖాస్తులను ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు పరిశీలించి లోన్లు ఇస్తాయి. ఎక్కువగా ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఈ లోన్లను అందిస్తున్నాయి. ఫాం నింపాక అన్ని పత్రాలను, వివరాలను పరిశీలించి లోన్ మంజూరు చేస్తారు. దాన్ని సంవత్సరంలోగా తిరిగి చెల్లిస్తే వడ్డీపై సబ్సిడీ లభిస్తుంది.
Advertisements