Advertisement
సాధారణంగా ఇంట్లో TV రిమోట్ పనిచేయకపోతే ఎవరైనా ఏం చేస్తారు ? అందులో ఉన్న బ్యాటరీలను బయటకి తీసి అటు, ఇటు రోల్ చేసి.. వాటిని అవసరం అయితే వేడి చేసి.. మళ్లీ రిమోట్‌లో వేసి.. ఆపరేట్ చేస్తారు. పనిచేస్తే ఓకే.. లేదంటే రిమోట్‌ను కొడతారు. అలా చేసినా రిమోట్ పనిచేస్తే ఓకే.. లేదంటే చిరాకు వస్తుంది. అసలు రిమోట్ పనిచేస్తుందా, లేదా.. కొత్త రిమోట్ తేవాలా ? అన్న విషయం తెలియదు. కానీ కింద తెలిపిన ట్రిక్‌తో నిమిషంలోనే మీ TV రిమోట్ పనిచేస్తుందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.
Advertisement
టీవీ రిమోట్‌పై ఉండే బటన్లను ప్రెస్ చేస్తే దాని పై భాగంలో ఉండే ఎల్ఈడీ లైట్ వెలిగేది మనకు కనిపించదు. కానీ అదే లైట్‌ను ఫోన్ కెమెరా కింద ఉంచండి. అంటే.. ఫోన్‌లో కెమెరా యాప్ ఓపెన్ చేసి.. ఫోన్ కింద రిమోట్ ఎల్ఈడీ లైట్ కనిపించేలా పట్టుకోండి. ఫోన్ కెమెరా యాప్‌లో ఆ ఎల్ఈడీ లైట్‌ను చూస్తూ రిమోట్‌పై ఉండే బటన్లను ప్రెస్ చేయండి. అప్పుడు ఆ లైట్‌లో పర్పుల్ కలర్ వెలుగు మనకు కనిపిస్తుంది. అలా కనిపిస్తే రిమోట్ పనిచేస్తున్నట్లు లెక్క. లేదంటే రిమోట్ పనిచేయడం లేదని తెలుసుకోవాలి.
Advertisements
పైన తెలిపిన ట్రిక్‌తో ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ ఏదైనా సరే పనిచేస్తుందో, లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం.. ఒక్కసారి ఈ ట్రిక్‌ను ప్రయత్నించి చూడండి..!
Advertisements