Advertisement
కొ… రోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రతి ఒక్కరూ మాస్కులను ధరిస్తున్నారు. హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లను వాడుతున్నారు. సోషల్ డిస్టన్స్ ను పాటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారికి కూడా అవగాహన కల్పించడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని మొబైల్ వినియోగదారుల ఫోన్లకు కొ… రోనా కాలర్ ట్యూన్‌ను సెట్ చేయించింది. టెలికాం సంస్థలన్నీ కలిసి జాయింట్‌గా ఈ సర్వీస్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలో మొబైల్ వినియోగదారులు ఇతరులకు కాల్ చేస్తే వారికి కొ… రోనా కాలర్ ట్యూన్ వినిపిస్తుంది.
కొ… రోనా కాలర్ ట్యూన్‌లో ముందుగా దగ్గు సౌండ్ వినిపిస్తుంది. తరువాత చేతులను సబ్బుతో కడుక్కోవాలని చెబుతారు. అలాగే కో… విడ్ జాగ్రత్తలను, ఇతర వివరాలను తెలియజేస్తారు. మొత్తం 30 సెకన్ల పాటు ఆ కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. అయితే కొందరికి ఈ ట్యూన్ విసుగు తెప్పిస్తోంది. ఈ క్రమంలో అలాంటి వారు ఈ ట్యూన్‌ను డీయాక్టివేట్ చేయాలని అనుకుంటున్నారు. వారు కింద తెలిపిన సూచనలు పాటిస్తే ఆ ట్యూన్‌ను డీయాక్టివేట్ లేదా వినిపించకుండా చేయవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే…
Advertisement
మెథడ్ – 1:
1. మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న లేదా మీరు కావాలనుకున్న వారికి ముందుగా ఫోన్ చేయండి. ఆ నంబర్‌ను డయల్ చేయండి.
2. కొ…. రోనా కాలర్ ట్యూన్ వినిపిస్తుంది.
Advertisements
3. ట్యూన్ వినిపించడం మొదలు కాగానే కీప్యాడ్ ఓపెన్ చేసి నంబర్ 1 ను ప్రెస్ చేయండి. కొన్ని సార్లు ఎక్కువ సార్లు ఆ నంబర్‌ను ప్రెస్ చేయాల్సి వస్తుంది.
4. ఆ నంబర్‌ను అలా ప్రెస్ చేయగానే కొ… రోనా కాలర్ ట్యూన్ వినిపించడం ఆగుతుంది. సాధారణ కాలర్ ట్యూన్ వినిపిస్తుంది.
పైన తెలిపిన విధానం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లకు చెందిన కస్టమర్లకు పనిచేస్తుంది.
మెథడ్ – 2:
ఎయిర్‌టెల్ వినియోగదారులు *646*224# అనే నంబర్‌ను ప్రెస్ చేసి అనంతరం 1 నొక్కితే కొ… రోనా కాలర్ ట్యూన్ డీయాక్టివేట్ అవుతుంది.
మెథడ్ – 3:
జియో కస్టమర్లు STOP అని టైప్ చేసి 155223 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. దీంతో కొ… రోనా కాలర్ ట్యూన్ డీయాక్టివేట్ అవుతుంది.
మెథడ్ – 4:
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు UNSUB అని టైప్ చేసి 56700 లేదా 56799 అనే నంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి.
మెథడ్ – 5 :
ఐడియా కస్టమర్లు STOP అని టైప్ చేసి 155223 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. లేదా కాల్ చేయవచ్చు.
మెథడ్ – 6:
వొడాఫోన్ కస్టమర్లు CANCT అని టైప్ చేసి 144 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. దీంతో కొ… రోనా కాలర్ ట్యూన్ ను డీయాక్టివేట్ చేయవచ్చు.
Advertisements