Advertisement
మీ దగ్గర చిరిగిన లేదా బాగా పాతబడిన నోట్లుంటే ( 2000 లతో సహా ) RBI NOTE REFUND కింద వాటిని మార్చుకొవొచ్చు. దేశంలోని అన్ని బ్యాంకులకు చెందిన బ్రాంచులు కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు కస్టమర్లకు అవకాశం ఇస్తాయి. మీరిచ్చిన నోటుకు సమానమైన విలువగల డబ్బును తిరిగి ఇస్తాయి.
చిరిగిన కరెన్సీ మార్చుకునే క్రమంలో RBI ఇచ్చిన NOTE REFUND RULES-2009 ను చూద్దాం!
- బ్యాంకులు ఆర్‌బీఐ నోట్ రీఫండ్ రూల్స్ 2009 ప్రకారం కరెన్సీ మార్పిడి సేవను ప్రజలకు ఉచితంగా అందివ్వాలి. అందుకు ఎలాంటి రుసుము తీసుకోరాదు.
- సాధారణ వాడకం వల్ల పాతబడ్డ కరెన్సీ నోట్లు, వాటిపై ఉండే ఫీచర్లు మిస్సైన నోట్లను మాత్రమే బ్యాంకులు తీసుకోవాలి. అదే పూర్తిగా చిరిగిపోయిన, నల్లగా మారిన, కాలిపోయిన నోట్లను తీసుకోరాదు.
- బ్యాంకులు ఒక వ్యక్తి నుంచి నిత్యం 20 పాతబడ్డ, చిరిగిన కరెన్సీ నోట్లను తీసుకుని వాటిని మార్చి ఇవ్వవచ్చు. వాటి విలువ రూ.5వేలకు మించరాదు.
Advertisements
Advertisement
- ఇక 20 కరెన్సీ నోట్ల కన్నా ఎక్కువ ఉన్నా, వాటి విలువ రూ.5వేలు మించితే …బ్యాంకులు కొంత రుసుము తీసుకుని నోట్లను మార్పిడి చేయవచ్చు. అదే నోట్ల విలువ రూ.50వేలు దాటితే బ్యాంకులు….ఆ నోట్లకు గాను కస్టమర్‌కు రశీదు ఇచ్చి.. వాటిని తరువాత అతని బ్యాంకు అకౌంట్‌లో జమ చేయడమో, లేదా తరువాత నిర్దిష్టమైన టైముకు మార్చిన నోట్లను (కొత్త నోట్లను) ఇవ్వడమో చేయాలి.
- ఆర్‌బీఐ నోట్ రీఫండ్ రూల్స్ 2009 ప్రకారం.. కరెన్సీ నోట్లపై ఏవైనా నినాదాలు, సందేశాలు, ఇతర రాతలు రాసినా.. అలాంటి నోట్లను విలువ లేనివిగా, చెల్లని నోట్లుగా భావిస్తారు. బ్యాంకులు అలాంటి నోట్లను తీసుకోరాదు.
Advertisements