Advertisement
కార్లను కలిగి ఉన్నవారు వాటి గురించి ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. టైముకు సర్వీసింగ్ గట్రా చేయిస్తారు. కానీ ముఖ్యంగా వాటి టైర్ల విషయానికి వచ్చే సరికి అశ్రద్ధ చేస్తుంటారు. దీంతో అవి బాగా అరిగిపోయి ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బందులకు గురి చేస్తాయి. టైర్లు బాగా అరిగిపోయాయనే విషయాన్ని కూడా కొందరు త్వరగా గుర్తించరు. దీంతో ఆ విషయం కారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు.. బాగా అరిగిపోయిన టైర్లతో కారును నడపడం వల్ల ప్రమాదాల బారిన పడేందుకు కూడా అవకాశం ఉంటుంది.
Advertisement
అయితే కార్ టైర్లు అరిగిపోయాయా, లేదా.. అన్న విషయం చాలా మందికి తెలియదు. సర్వీస్ సెంటర్‌లో మెకానిక్‌లు చెబితేనే గుర్తిస్తారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే కారు టైర్లు అరిగిపోయాయా, లేదా అన్న విషయాన్ని మనమే సులభంగా గుర్తించవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. సాధారణంగా కారు టైర్లను తయారు చేసే కంపెనీలు ఆ టైర్లపై త్రెడ్ వియర్ ఇండికేటర్‌ను ఇస్తాయి. ఇవి చిన్న చిన్న బాణం గుర్తుల రూపంలో టైర్ ఎడ్జ్‌లో ఉంటాయి. చిత్రంలో చూసి ఆ బాణం గుర్తులను గమనించవచ్చు. టైర్‌ను ఆ బాణం గుర్తు వరకు అరిగిపోయేదాకా ఉపయోగించవచ్చన్నమాట. అక్కడి వరకు అరిగాక టైర్‌ను మార్చాల్సి ఉంటుంది. అందుకనే ఆ బాణం గుర్తును టైర్ ఎడ్జ్‌లో ముద్రిస్తారు.
Advertisements
ఇక సాధారణంగా కొత్త టైర్ల త్రెడ్ 8 నుంచి 12 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. దాన్ని 1.5 మిల్లీమీటర్ల మందం వరకు అరిగేదాకా ఉపయోగించవచ్చు. అంతకన్నా తక్కువ మందం ఉంటే మాత్రం టైర్లను వెంటనే మార్చాల్సి ఉంటుంది. ఆ మందాన్ని కూడా మనం సులభంగానే గమనించవచ్చు. ఈ విధంగా టైర్లను చాలా జాగ్రత్తగా గమనించడం ద్వారా వాటి త్రెడ్డింగ్ అరిగిపోయిందా,లేదా అన్న వివరాలు సులభంగా తెలుస్తాయి. దీంతో జాగ్రత్త పడి కార్ టైర్లను త్వరగా మార్చుకుని సేఫ్‌గా ప్రయాణం చేయవచ్చు.
Advertisements