Advertisement
స్మార్ట్‌ఫోన్ల నుంచి రేడియేషన్ వస్తుందన్న సంగతి తెలిసిందే. వాటిలో ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిటింగ్ డివైస్ వల్ల ఫోన్ల నుంచి రేడియేషన్ వస్తుంటుంది. ఫోన్లలో ఉండే సిమ్ కార్డుల నుంచి సిగ్నల్‌ను ఆ డివైస్ తీసుకుని సమీపంలో ఉన్న టవర్‌కు రేడియో సంకేతాలు పంపిస్తుంది. అక్కడి నుంచి సంకేతాలు తిరిగి ఫోన్‌కు వస్తాయి. అందువల్లే మనం ఫోన్ కాల్స్ మాట్లాడగలుగుతాం. ఇక ఫోన్‌లో సిగ్నల్ కోసం ఆ డివైస్ నిరంతరం టవర్‌కు సిగ్నల్స్ పంపుతూ, తీసుకుంటూ ఉంటుంది. దీంతో ఫోన్ వినియోగంలో లేనప్పుడు తక్కువగా, ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఎక్కువగా రేడియేషన్ వస్తుంటుంది. అయితే ఏ ఫోన్ నుంచి ఎంత మోతాదులో రేడియేషన్ విడుదలవుతుందనే విషయాన్ని మనం సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగంటే…
ఫోన్లను ప్యాక్ చేసే బాక్సులపై, ఫోన్ల బ్యాక్ ప్యానెల్ లోపలి వైపు ఆ ఫోన్లకు సంబంధించిన SAR వాల్యూను ప్రింట్ చేస్తారు. SAR వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఫోన్ నుంచి రేడియేషన్ అంత ఎక్కువగా విడుదలవుతుందన్నమాట. ఇక ఫోన్ల తయారీ కంపెనీలు తయారు చేసే ఫోన్లకు గాను భిన్నమైన SAR వాల్యూలను ప్రింట్ చేస్తుంటాయి. కొన్నింటికి ఆ వాల్యూ ఎక్కువగా, కొన్నింటికి తక్కువగా ఉంటుంది. అయితే ఏ ఫోన్‌కైనా సరే.. SAR వాల్యూ 1.6w/kg (Body, Head) కన్నా తక్కువగా ఉండాలి. అలా ఉంటే ఆ ఫోన్‌ను మనం సురక్షితంగా వాడవచ్చన్నమాట. అంతకు మించి SAR వాల్యూ ఉన్న ఫోన్లను మనం వాడకూడదు. వాడితే రేడియేషన్ బారిన పడాల్సి వస్తుంది. ఇక ఏదైనా ఒక ఫోన్‌కు ఉండే SAR వాల్యూను ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఫోన్‌కు ఉండే SAR వాల్యూను ఇలా తెలుసుకోండి:
Advertisement
- ఫోన్‌ను అన్‌లాక్ చేసి డయలర్ కీప్యాడ్ ఓపెన్ చేయాలి.
- అందులో *#07# అనే నంబర్‌ను టైప్ చేసి డయల్ చేయాలి.
- ఫోన్ తెరపై SAR రేటింగ్ వాల్యూ దర్శనమిస్తుంది.
- ఆ విలువ 1.6w/kg (Body, Head) కన్నా తక్కువగా ఉందా, లేదా అనేది చూడాలి.
- ఆ వాల్యూ తక్కువగా ఉంటే ఫోన్‌ను నిర్భయంగా వాడుకోవచ్చు. ఎలాంటి ప్రమాదం లేదు.
- ఆ వాల్యూ అంత కన్నా ఎక్కువగా ఉంటే ఫోన్‌ను వాడడం ఆపేయాలి.
ఇక ప్రస్తుత మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉన్న తక్కువ రేడియేషన్ కలిగిన స్మార్ట్‌ఫోన్ల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే:
Advertisements
- శాంసంగ్ గెలాక్సీ ఎం21 – 0.47 (SAR వాల్యూ) – రూ.12,699 (ధర)
- శాంసంగ్ గెలాక్సీ ఎం31 – 0.52 – రూ.15,999
- గెలాక్సీ ఎం30ఎస్ – 0.47 – రూ.14,999
- గెలాక్సీ ఎం10ఎస్ – 0.39 – రూ.8,999
- గెలాక్సీ ఎ50ఎస్ – 0.43 – రూ.18,570
- గెలాక్సీ ఎం30 – 0.28 – రూ.10,999
- గెలాక్సీ ఎం20 – 0.25 – రూ.11,999
- నోకియా 6.1 – 0.94 – రూ.11,999
- నోకియా 7 ప్లస్ – 0.36 – రూ.11,999
- నోకియా 7.1 – 0.26 – రూ.13,900
- నోకియా 5.1 – 0.29 – రూ.9,900
- మోటోరోలా వన్ పవర్ – 0.31 – రూ.11,299
- లెనోవో కె10 ప్లస్ – 0.34 – రూ.11,499
- షియోమీ రెడ్‌మీ 8 – 0.34 – రూ.10,999
- షియోమీ పోకో ఎఫ్1 – 0.66 – రూ.17,499
Advertisements
కాగా శాంసంగ్‌లో దాదాపుగా అనేక ఫోన్లు SAR వాల్యూ 1.0 కన్నా తక్కువగా లేదా ఆ అంకెకు దగ్గరగా ఉండగా.. ఆపిల్‌కు చెందిన అనేక ఐఫోన్ల SAR వాల్యూలు 1.0 కన్నా దాదాపుగా ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఆ ఫోన్ల నుంచి అధిక మొత్తంలో రేడియేషన్ విడుదల అవుతుందని అర్థం చేసుకోవాలి. ఇక షియోమీలో కేవలం కొద్ది మోడల్స్‌లో మాత్రమే SAR వాల్యూ తక్కువగా ఉంది.. మిగిలిన అన్ని మోడల్ ఫోన్లలో SAR వాల్యూలు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే హువావే, ఒప్పో, వివో, వన్‌ప్లస్, మోటోరోలా, లెనోవో తదితర అన్ని కంపెనీలకు చెందిన ఫోన్లలోనూ SAR వాల్యూలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే నిత్యం మనం వాడే అనేక ఫోన్ల నుంచి రేడియేషన్ అధిక స్థాయిలో విడుదలవుతుందన్నమాట..!