Advertisement
“పెరుగు”.. చివర్లో పెరుగుతో ముద్ద తింటే తప్ప భోజనం కంప్లీట్ అయినట్టు ఉండదు..కేవలం రుచి కోసమే కాదు..పెరుగు వలన అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి..ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగన్నం తింటే చలవచేస్తుంది. పెరుగన్నం అంటే అందరికి ఇష్టమే కానీ పెరుగు తోడు పెట్టడం మాత్రం కష్టం.. అందులో కష్టం ఏముంది ..పాలు తీసుకుని స్పూన్ పెరుగు కలిపేస్తే సరి..కానీ పాలల్లో కలపడానికి ఆ స్పూన్ పెరుగు లేకపోతే…
పాయింట్ కి వచ్చేద్దాం..పెరుగు తోడు పెట్టడానికి పెరుగు లేకుండా ఎలా తోడు పెట్టొచ్చో చూద్దాం..ఈ చిట్కా ఫాలో అయితే ఇకపై పెరుగు తోడు పెట్టాల్సి వచ్చినప్పుడల్లా అయ్యో తోడుకి కొంచెం మజ్జిగ చుక్క కూడా లేదే అని బాధపడాల్సిన పని ఉండదు..మరికెందుకు లేట్..ఏమేం కావాలి..ఎలా తోడు పెట్టాలి చూడండి..
Advertisement
కావలసిన పదార్దాలు
Advertisements
1 లీటర్ – కాచిన పాలు
2 – పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి
1 – నిమ్మకాయ
తయారీ విధానం
*తోడు పెట్టడానికి ముందు పాలు గోరువెచ్చగా ఉండేలా చూస్కోవాలి..ఇప్పుడు ఆ పాలల్లో పచ్చిమిరమకాయలను వేయాలి…లేదంటే రండు టీస్పూన్ల నిమ్మరసాన్ని పిండాలి..తర్వాత కలిపి గట్టిగా మూతపెట్టి ,వెచ్చగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి..10-12 గంటలలో మీకు పెరుగు రెడీ అయిపోతుంది..
ఈ పెరుగు తయారు చేయడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలు..
- ఫుల్ క్రీమ్ మిల్క్ ని మాత్రమే వాడాలి.
- ముందుగా పాలను బాగా వేడి చేయాలి..తర్వాత వాటిని చల్లార్చి..తోడు పెట్టడానికి ముందు గోరువెచ్చగా ఉండేలా చూడలి..
- పెరుగు పుల్లగా అవ్వకూడదంటే.. పెరుగు తోడుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
మరింకెందుకు లేట్.. మీరు ఇలా ట్రై చేసి చూడండి.
Advertisements