Advertisement
ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్లు సాధారణ గృహోపకరణాలుగా మారిపోయాయి. ఎక్కువగా ఆహారం నిల్వ కోసమే ప్రజలు వాటిని వాడుతూ ఉంటారు. ఇక ఫ్రిడ్జ్ వాడకంలో ఒక ముఖ్యమైన భాగం లోపల ఇన్స్టాల్ చేసిన ఫ్రీజర్. ఫ్రీజర్ ప్రాథమిక విధి ఆహార పదార్థాలను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడటం. ఫ్రీజర్ ఉష్ణోగ్రత ఫ్రిజ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆహార పదార్థాన్ని ఎక్కువకాలం దాచి పెట్టాలి అంటే అప్పుడు ఫ్రీజర్ ను వాడతారు.
అయితే, ఫ్రీజర్‌ని ఉపయోగిస్తున్నప్పటికీ, ఫ్రీజర్‌ను సరిగ్గా ఉపయోగించే మార్గాల గురించి చాలా మందికి ఇప్పటికీ అవగాహన లేదనే చెప్పాలి. ఇప్పుడు మీకు దానికి సంబంధించిన చిట్కాలను వివరిస్తాం.
ఫ్రిజ్‌లో వేడిగా ఉన్నప్పుడు ఏ ఆహార పదార్థాన్ని ఉంచకుండా జాగ్రత్త పడాలి. చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రీజర్ లో ఉంచాలి. వేడి ఆహారాన్ని ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల ఫ్రీజర్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికే అందులో ఉంచిన ఇతర ఆహారాన్ని డీఫ్రాస్ట్ చేయవచ్చు. పెద్ద మొత్తంలో ఆహారం ఉంటే, దానిని ఫ్రీజర్‌లో భాగాలలో ఉంచితే శీతలీకరణ ప్రక్రియ పెరుగుతుంది.
Advertisement
ఇక ఫ్రీజర్‌లో ఆహారాన్ని ఉంచే ముందు, దానిని సరిగ్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయలేకపోతే ఫ్రీజర్ బర్న్ అవుతుంది. ‘ఫ్రీజర్ బర్న్’ అంటే ఆహారంలో ఉన్న నీరు విడుదల అవుతుంది. అప్పుడు ఆహారం పాడైపోయే అవకాశం ఉంది. దాన్ని నిర్జలీకరణ అని అంటారు. అలా చేయడంతో ఆహారం నాణ్యత క్షీణిస్తుంది. కాని ఆహారం మాత్రం పాడయ్యే అవకాశం లేదు.
Advertisements
Advertisements
ఫ్రీజర్‌లో అవసరమైనన్ని ఆహార పదార్థాలను మాత్రమే నిల్వ చేయడం నేర్చుకుంటే మంచిది. లేదంటే మాత్రం లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరో విషయం ఏంటీ అంటే ఫ్రీజర్‌లో మరిన్ని ఆహార పదార్థాల కోసం, లేబులింగ్ చేసుకోవడం మంచిది. దీనిలో భాగంగా ముడి ఆహారం, వండిన ఆహారం విడివిడిగా గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఫ్రీజర్ లోపల మంచు గడ్డకట్టడం మంచిది కాదు. మంచు గడ్డకడితే ఫ్రిడ్జ్ ను ఆపుకోవడం మంచిది.