Advertisement
మన దేశంలో అయితే జనాలకు రెండు రకాల టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. ఒకటి ఇండియన్ స్టైల్. మరొకటి వెస్టర్న్ స్టైల్. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమకు అనువుగా ఉండే టాయిలెట్లను ఉపయోగిస్తుంటారు. అయితే జపాన్ దేశానికి చెందిన ప్రజలు ఉపయోగించే టాయిలెట్లు మనకు పూర్తి భిన్నంగా ఉంటాయి. వారు కూడా రెండు రకాల టాయిలెట్లను ఉపయోగిస్తారు. చూసేందుకు అవి అచ్చం ఒకేలా అనిపిస్తాయి. కానీ వేర్వేరుగా ఉంటాయి.
- మొదటిది….. ఫ్లష్ సిస్టమ్ లేని టాయిలెట్. పైన చిత్రంలో చూపిన విధంగా అది ఉంటుంది. అందులో షీల్డ్ కు వ్యతిరేక దిశలో టాయిలెట్ రంధ్రం ఉంటుంది.
- రెండోది… ఫ్లష్ సిస్టమ్ ఉన్న టాయిలెట్. అది కింద చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది. అందులో షీల్డ్, టాయిలెట్ రంధ్రం రెండూ ఒకేవైపుకు ఉంటాయి.
అయితే ఆ రెండు టాయిలెట్లలోనూ షీల్డ్‌కు ఎదురుగా ఉండేలా టాయిలెట్‌పై కూర్చోవాలి. కానీ సీటు చక్కగా ఉందని చెప్పి దానిపై మొత్తం శరీరాన్ని ఉంచి కూర్చోరాదు. ఎందుకంటే ఆ సీటు క లోతుగా ఉంటుంది కనుక బ్యాలెన్స్ తప్పితే అందులో పడిపోయే ప్రమాదముంది!
Advertisement
ఇక ఫ్లష్ సిస్టమ్ లేని టాయిలెట్లకు పెద్ద సెప్టిక్ ట్యాంక్‌ను అనుసంధానం చేస్తారు. ఈ క్రమంలో ఆ ట్యాంక్ నిండినప్పుడు దాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్లిష్ సిస్టమ్ ఉన్న టాయిలెట్‌కు సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీ సిస్టమ్ రెండూ అనుసంధానమై ఉంటాయి. ఏ మార్గంలో అయినా డ్రైనేజీని బయటకు పంపవచ్చు. ఇలా జపాన్‌లో టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఉంటాయి.
Advertisements
ఎలక్ట్రిక్ టాయిలెట్స్….. టెక్నాలజీలో ట్రెండ్ సెట్ చేసే జపాన్….తమ టాయిలెట్స్ లోకి కూడా ఎలక్ట్రికల్ గా మార్చేసింది! టాయిలెట్ అవ్వగానే ..క్లీనింగ్ తంతు ముగించుకొని ఒక బటన్ నొక్కితే చాలు…ఫ్టష్ తో పాటు …..వేడి వ్యాక్యూమ్ బయటకు వచ్చి…. క్లీనింగ్ తో పాటు కంటికి కనిపించే క్రీములు సైతం చనిపోతాయి..దానికి తోడు చెడు వాసన సైతం రాదు.!
Advertisements
Japan etoilets Video :