Advertisement
రహదారులపై వెళ్లే కార్లు, బస్సులు, ఇతర వాహనాలన్నింటినీ మనం మలుపుల దగ్గర సులభంగా తిప్పుతాం. కార్లు, బస్సులు, లారీలు, వ్యాన్లు వంటి వాహనాలకు అయితే చక్రాలకు మధ్య ప్రత్యేక యాక్సిల్ అమరిక ఉంటుంది కనుక వంపు ఉన్న ప్రాంతంలోనూ అవి సులభంగా టర్న్ అవుతాయి. అయితే రైళ్ల మాటేమిటి ? వంపు ఉన్న మార్గం దగ్గర, అందులోనూ పట్టాలపై రైళ్లు ఎలా మలుపు తిరుగుతాయి ? అంటే…
రైలు బోగీలు లేదా ఇంజిన్‌కు కింది భాగంలో మందంతో కూడిన రెండు చక్రాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే కార్లు, బస్సుల్లా ఆ చక్రాలకు మధ్య యాక్సిల్ అమరిక ఉండదు. రెండూ ఒకే ఇనుప రాడ్‌కు బిగించబడి ఉంటాయి. మరైతే అలా ఉంటే మలుపుల దగ్గర ఇబ్బంది అవుతుంది కదా.. అంటే.. కాదు.. ఎందుకంటే.. రైలు చక్రాలు మందంగా ఉన్నప్పటికీ బయటి వైపుకు వ్యాసం తక్కువగా, లోపలి వైపుకు వ్యాసం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చక్రాలు వంపు ఉన్న మార్గం వద్ద సులభంగా టర్న్ అవుతాయి.
Advertisement
వంపు మార్గం వద్ద రైలు ప్రయాణించేటప్పుడు వంపు లోపలి వైపుకు ఉండే చక్రాల కన్నా బయటి వైపుకు ఉండే చక్రాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ రెండింటి వేగం ఒకేలా ఉంటుంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకే చక్రాలకు చెందిన లోపలి భాగం పనికొస్తుంది. రైలు వంపు మార్గంలోకి రాగానే ఆటోమేటిగ్గా చక్రాల లోపలి భాగం పట్టాలపై సెట్ అవుతుంది. దీంతో రైలు సులభంగా టర్న్ అవగలుగుతుంది. అదే మరొక వైపుకు వంపు వచ్చినప్పుడు ఈ సారి అవతలి వైపు ఉండే చక్రాలు పైవిధంగా మారుతాయి. కనుక వంపు ఉన్న మార్గాల్లో రైళ్లు సులభంగా మలుపులు తిరుగుతాయి. అయితే ఈ తేడాను రైలులో ఉన్నవారు దాదాపుగా గమనించలేరు. రైలు బయట ఉండి చూసే వారికి రైలు ఎలా మలుపు తిరుగుతుంది ? అన్న విషయం కచ్చితంగా తెలుస్తుంది. కావాలంటే పోస్టులో ఉన్న వీడియోను చూసి రైలు ఎలా మలుపు తిరుగుతుందో తెలుసుకోవచ్చు.
Advertisements
Watch Video:
Advertisements