Advertisement
మన దేశంలో ప్రస్తుతం రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రం ఆధీనంలో ఉంటాయి. చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, ఢిల్లీ లడక్ లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. అయితే వీటిలో పుదుచ్చేరి, ఢిల్లీలు సొంత శాసనసభలను కలిగి వాటికవే పాలించుకుంటున్నాయి. అందువల్ల ఇవి రాష్ట్రాల మాదిరిగా పనిచేస్తాయి. కాకపోతే వాటి శాంతి భద్రతలను కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఇక మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రమే చూసుకుంటుంది. అయితే కేంద్ర పాలిత ప్రాంతాలు అసలు ఎలా ఉనికిలోకి వచ్చాయని అందరికీ సందేహం కలుగుతుంటుంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చాక అండమాన్ నికోబార్ దీవులను బ్రిటిష్ వారు తమ ఆధీనంలోనే ఉంచుకోవాలనుకున్నారు. కానీ అది వారికి సాధ్యం కాలేదు. అయితే అందుకు సరైన కారణాలు కూడా తెలియవు కానీ.. బ్రిటిష్ వారు ఆ పని చేయలేదు. ఇక అప్పట్లో లక్షదీవులను పాకిస్థాన్ కైవసం చేసుకోవాలని చూసింది. కానీ అప్పటికే అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ భారత నేవీని రంగంలోకి దించారు. లక్షదీవులను ఇండియన్ నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది. లక్షదీవుల ప్రజలు కూడా భారత్‌తో కలిసి ఉండేందుకే ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలో భారత నేవీని చూసిన పాక్ నేవీ సముద్రం నుంచి అటు నుంచి అటే సైలెంట్‌గా వెళ్లిపోయింది.
Advertisement
ఇక గోవా, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నాగర్ హవేలి ప్రాంతాలు పోర్చుగీసు వారిపై పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్నాయి. అవి ఇండియాతో కలిసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. అలాగే పుదుచ్చేరి ఫ్రెంచ్ వారి నుంచి విముక్తి పొందింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలు అప్పట్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాయి. దీంతో కేంద్రం వాటిని తన ఆధీనంలోకి తీసుకుంది. వాటిని రాష్ట్రాలుగా ప్రకటించలేదు. కానీ వాటిని రాష్ట్రాలుగా చేస్తే ఇబ్బందులు వస్తాయని ఆలోచించి వాటిని ప్రత్యేక ప్రాంతాలుగా ఉంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 1874 నుంచి ఆయా ప్రాంతాలను షెడ్యూల్డ్ డిస్ట్రిక్స్ అని పిలవగా.. తరువాత వాటిని చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ అని వ్యవహరించారు. భారత దేశానికి స్వాతంత్య్రం లభించాక వాటిని పార్ట్ సి, పార్ట్ డి ప్రత్యేక ప్రాంతాలుగా పేర్కొన్నారు. తరువాత 1956లో 7వ రాజ్యాంగ సవరణ, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టాలను అనుసరించి వాటిని యూనియన్ టెర్రిటరీలు (కేంద్ర పాలిత ప్రాంతాలు)గా వ్యవహరించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలనే వాటిని పిలుస్తున్నారు.
Advertisements
Advertisements
అయితే కేంద్ర పాలిత ప్రాంతాలు అయినప్పటికీ వాటిని రాష్ట్రాలుగా కూడా మార్చవచ్చు. గతంలో హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవాలు కేంద్ర పాలిత ప్రాంతాలుగానే ఉండేవి. కానీ వాటిని రాష్ట్రాలుగా మార్చారు. ఇక మిగిలిన వాటిని అలాగే ఉంచారు. కాకపోతే ఢిల్లీని ఢిల్లీ ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)గా మార్చారు. ఢిల్లీ, పుదుచ్చేరిలలో సొంత శాసనసభలు ఉన్నాయి. సీఎంలు పాలిస్తున్నారు. కానీ చాలా వరకు కేంద్రానికే అధికారాలు ఉంటాయి. ఈ విధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు మనుగడలోకి వచ్చాయి.