Advertisement
మేడ్ ఇన్ చైనా… మేడ్ ఇన్ చైనా… ప్రతి వస్తువు మీద దర్జాగా దర్శనమిచ్చే పదమిది. మరి మన నినాదమైన మేడ్ ఇన్ ఇండియా పరిస్థితి ఏంటి? ఆర్థికంగా చైనాను ఎప్పుడు దాటుతాం. అసలు ఇది సాధ్యమా? ఎకానమీలో డ్రాగన్ కంట్రీని దాటాలంటే మన దేశం ఏం చేయాలి.? అవే అంశాలపై ఇప్పుడో లుక్ వేద్దాం.!
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జీడీపీ, వృద్ధి రేటు కలిగిన రెండో దేశం చైనా. 2018 లెక్కల ప్రకారం చైనా జీడీపీ 13.61 లక్షల కోట్ల డాలర్లు .. అదే భారత్ విషయానికి వస్తే.. జీడీపీ 2.72 లక్షల కోట్ల డాలర్లు మాత్రమే. ఈ ఒక్క విషయాన్ని గమనిస్తే చాలు.. చైనా భారత్ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ముందుందో మనకు స్పష్టమవుతుంది. అయితే ఇంతటి గ్యాప్‌ను అధిగమించాలంటే.. భారత్‌కు చాలా సమయం పడుతుంది. అందుకు గాను ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించి వాటిని అమలు చేయాలి.
- చైనాలో పరిశ్రమలు, సప్లయిదారులు ఒకే క్లస్టర్‌గా ఉంటారు. వారు దగ్గర దగ్గరగా ఉంటారు. దీంతో పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తులను సప్లయిదారులు చాలా వేగంగా సరఫరా చేస్తారు. ఇక్కడే చాలా సమయం, డబ్బు ఆదా అవుతాయి. వినియోగదారులకు కావల్సిన ఉత్పత్తులు చాలా వేగంగా సరఫరా అవుతాయి. అంతర్జాతీయంగా కూడా రవాణా చాలా వేగంగా జరుగుతుంది.
- చైనాలో పరిశ్రమలకు కావల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. అక్కడ అద్భుతమైన ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఆ విషయంలో భారత్ మెరుగు పడాలి. పరిశ్రమలను నెలకొల్పేందుకు కావల్సిన అనుమతుల దగ్గర్నుంచీ వారికి కావల్సిన సదుపాయాలు, వర్క్ ఫోర్స్, ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసుకోవడం, అందుకు అనుగుణంగా సౌకర్యాల కల్పన.. వంటి విషయాల్లో చైనా మనకన్నా ఎన్నో రెట్లు ముందుంది. అవే విషయాల్లో భారత్ ఇంకా మెరుగు పడాలి.
- నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులకు చైనాలో విస్తృతమైన మార్కెట్ ఉంది. అంటే.. అక్కడ మార్కెట్ పరిధి ఎక్కువ. కానీ భారత్‌లో మార్కెట్ అలా లేదు. అయితే భారత్‌లోనూ ఆయా వస్తువులకు మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేయాలి. మార్కెట్‌ను పెంచాలి. దీంతో వస్తువుల కొనుగోలు, వినియోగం ఎక్కువవుతుంది. దీంతో ఆటోమేటిగ్గా వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా పరిశ్రమలు ఎక్కువ స్థాయిలో వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు.
- చైనాలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు కంపెనీలను ఏర్పాటు చేసేందుకు సమ ప్రాధాన్యతను కల్పిస్తారు. ప్రభుత్వాలకు చెందిన భూములను కంపెనీలు పెట్టేందుకు ఇవ్వడం, ప్రభుత్వ నిధులు అందజేయడం, పన్ను మినహాయింపులు.. తదితర సౌకర్యాలన్నీ స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులిద్దరికీ కల్పిస్తారు. అలాంటి మోడల్ భారత్‌లో రావాలి.
Advertisements
Advertisement
- పెట్టుబడిదారులు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా వెనుకాడే అంశాల్లో ఒకటి.. క్రైం రేటు. నేరాలు ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ పరిశ్రమలను స్థాపించేందుకు పెట్టుబడిదారులు చూస్తారు. అందుకనే భారత్ ఈ విషయంలోనూ శ్రద్ధ వహించాలి. చైనాలో భారత్ కన్నా నేరాల రేటు చాలా తక్కువ. అందుకనే అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పుతుంటారు.
- చైనాను భారత్ ఆర్థికంగా అధిగమించాలంటే.. అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండడంతోపాటు యువతను ఉద్యోగాలు చేసే వారిగా తీర్చిదిద్దేందుకు అవసరం అయిన చర్యలు చేపట్టాలి. అందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు యువతకు ప్రత్యేకంగా నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలి.
- దేశంలోని అన్ని తీర ప్రాంతాల్లోనూ వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే.. నౌకాయానం ద్వారా వస్తువుల ఎగుమతి తేలికవుతుంది.
Advertisements
- GST ని మరింత పారదర్శకంగా అమలు చేయాలి. పరిశ్రమలకు మినహాయింపులు ప్రకటించాలి.
- ప్రభుత్వం ప్రజలందరికీ చేరువ కావాలి. వారి ఐడియాలకు విలువనివ్వాలి.
- నేరాల రేటును తగ్గించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అమలు చేయడంతోపాటు శాంతిభద్రతలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. అందుకు గాను పోలీసు వ్యవస్థను, ఇతర వ్యవస్థలను పటిష్టం చేయాలి.
- దేశంలోని పౌరులకు సమాజం, విలువలు, కామన్ సెన్స్, క్రమశిక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలి. (కరోనా కాలంలో పలు దేశాల్లోని ప్రజలు లాక్‌డౌన్ లేకున్నా కేవలం క్రమశిక్షణతోనే కరోనాను జయించారు.)
- రైలు, రోడ్డు మార్గాల్లో సరుకు రవాణా మరింత వేగంగా, సులభంగా అయ్యేలా చూడాలి. అందుకు గాను రైళ్ల స్పీడ్ పెంచడం, అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే సేవలు అందించడం చేయాలి. రోడ్డు మార్గాల్లో సరుకు రవాణా చేసే వారికి ప్రోత్సాహకాలు అందించాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా వారు సరుకు రవాణా చేసే విధంగా సౌకర్యాలు అందుబాటులోకి తేవాలి.
- పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. వచ్చే ఆదాయంతో భవిష్యత్ ప్రణాళికలు నిర్మించాలి. ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగాలి. సగటు పౌరుడికి చాలా సులభంగా ఉద్యోగం దొరికేలా చేయాలి. పరిశ్రమలు, సప్లయిదారులు, పనిచేసేవారు దగ్గర దగ్గరగా ఉండాలి. దీంతో ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతాయి. వేగంగా ఉత్పత్తి జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు అన్ని సౌకర్యాలు (ఇంటర్నెట్‌తో సహా) 100 శాతం అందేలా చూడాలి.
- విద్య, వైద్యం, ఉపాధి అంశాలే ప్రాధాన్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. భారత్ వ్యవసాయక దేశం కాబట్టి ఆ రంగంలోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు తేవాలి.
ఇవన్నీ జరిగితే భారత్ కచ్చితంగా చైనాను ఆర్థికంగా అధిగమిస్తుందని చెప్పవచ్చు..!