Advertisement
చిన్నతనంలో ప్రతి ఒక్కరూ పాఠశాలలో చదువుకునేటప్పుడు గణితంలో జామెట్రీ బాక్సులను కచ్చితంగా ఉపయోగించే ఉంటారు. వాటిల్లో పలు రకాల పరికరాలు ఉంటాయి. వృత్తలేఖిని, విభాగిని, కోణమానిని, స్కేలు, త్రిభుజాకార స్కేల్స్, ఎరేజర్, షార్పెనర్.. ఇలా టూల్స్ ఉంటాయి. అయితే వాటిలో నిజానికి మనం కొన్నింటినే ఉపయోగించాం. కొన్నింటిని అసలు జామెట్రీ బాక్సుల్లో ఎందుకు ఇచ్చారో మనకు ఇప్పటికీ తెలియదు.
అవును.. జామెట్రీ బాక్స్‌లో ఉండే విభాగిని, త్రిభుజాకార స్కేల్స్‌ను నిజానికి చాలా మంది ఉపయోగించలేదు. అసలు వాటిని జామెట్రీ బాక్సుల్లో ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. ఇదే విషయాన్ని ఓ మహిళ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె చెప్పింది నిజమేనని చాలా మంది ఆమెతో ఏకీభవిస్తున్నారు. విభాగిని, త్రిభుజాకార స్కేల్స్ ను అసలు ఎందుకు ఇచ్చారో, వాటితో ఏం ఉపయోగం ఉంటుందో ఇప్పటికీ తమకు కూడా తెలియదని నెటిజన్లు అంటున్నారు.
Advertisement
♥️?? pic.twitter.com/iwhKKukMM4
— Aparna Ramachandra (@msaparna) August 30, 2020
Advertisements
@Veenabhakta what's the significance of the traingle scales? Used them just to draw lines when the 15cm one got lost or broke
— Varsha (@nvvarsha) August 30, 2020
Divider used to be the least used device https://t.co/hO6yKy52hp
— D Prasanth Nair (@DPrasanthNair) August 30, 2020
Advertisements
ఇక జామెట్రీ బాక్సును కొన్న కొత్తలో దాన్ని ఎంతో మురిపెంగా చూసుకుంటామని, తరువాత అందులోని వస్తువులను పోగొట్టుకుంటామని కొందరు కామెంట్లు పెట్టారు. చిన్నతనంలో ఉపయోగించిన జామెట్రీ బాక్సును చూస్తుంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయని.. మరికొందరు కామెంట్లు చేశారు. ఇక ఆ మహిళ పోస్టుపై ఇంకా అనేక మంది రకరకాలుగా స్పందించారు. అయితే.. ఇప్పటికీ జామెట్రీ బాక్సులో ఉండే విభాగిని, త్రిభుజాకార స్కేల్స్ ను ఎందుకు ఉపయోగిస్తారో ఎవరికీ తెలియడం లేదు. అది మాత్రం నిజం..!