Advertisement
ఇతని పేరు వినోద్ …తమిళనాడులోని మధురైలో జాబ్ చేస్తుంటాడు. పుట్టింటికి వెళ్లిన తన భార్య రిటర్న్ జర్నీ కోసం ట్రైన్ టికెట్ బుక్ చేశాడు … RAC కింద టికెట్ బుక్ అయ్యింది . RAC అంటే (Reservation against cancellation) ఎవరైన తమ రిజర్వేషన్ కాన్సల్ చేసుకుంటే ఆ బెర్త్ ఇస్తారన్నమాట.!
సమయం – SEP – 22, 2018 ; రాత్రి 10.45:
హోసూర్ రైల్వే స్టేషన్…ట్రైన్ వచ్చింది…..గర్భావతి అయిన వినోద్ భార్య ట్రైన్ ఎక్కింది. కానీ సీట్ దొరకలేదు. “TTE ని రిక్వెస్ట్ చెయి…ఏదో ఒక బెర్త్ అడ్జెస్ట్ చేస్తాడ”ని ఫోన్ లో చెప్పాడు వినోద్.. సరే అనింది అతని భార్య.
సమయం : రాత్రి 11:00 :
Advertisements
“నాకు బెర్త్ దొరికింది” అని వినోద్ కు మెసేజ్ చేసింది భార్య…ఎగిరి గంతేసినంత పనిచేశాడు వినోద్ … ఓకే ఉదయం 8 గంటలకు మధురై స్టేషన్ దగ్గర రెడీగా ఉంటానని…హ్యాపీగా పడుకున్నాడు.
Advertisement
మరునాడు ఉదయం 6 గంటలకు లేచి…త్వరత్వరగా రెడీ అవుతున్నాడు వినోద్ …ఎందుకో ఓసారి ఫోన్ చూసుకున్నాడు. భార్య నుండి రెండు మెసేజ్ లున్నాయి. అవి కూడా 23 వ తేదీ ఉదయం 4.45 కు వచ్చిన మెసేజులు ..అందులో “నాకు బెర్త్ దొరికింది ” అని ఉంది. వినోద్ కు అర్థం కాలేదు…అదేంటీ… రాత్రి 11:00 గంటలకు ,ఉదయం 4.45 సేమ్ మెసేజెస్ ఎందుకు పంపిందని ఆలోచనలో పడ్డాడు.
వెంటనే భార్యకు కాల్ చేశాడు…మొదటి సారి లిఫ్ట్ చెయ్యలేదు, మళ్లీ చేశాడు…రెండో సారి ఫోన్ లిఫ్ట్ చేసిన భార్యతో …”నిజం చెప్పు నీకు బెర్త్ ఎప్పుడు దొరికిందో” అన్నాడు…ఉదయం 4.45 అని చెప్పింది..మరి నాతో ఎందుకు అబద్దం చెప్పావు అని అడగగా… “అలా చెప్పకపోతే మీరు రాత్రంతా నిద్రపోకుండా నా గురించి ఆలోచిస్తారని” చెప్పింది. “అయినా పర్లేదు స్టేషన్ కు వచ్చేయండి మరో 30 నిమిషాల్లో దిగుతాను” అంది.
సమయం – SEP – 23, 2018 ; ఉదయం 8 గంటలు:
మధురై స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగింది.. వినోద్ భార్య ట్రైన్ దిగింది. పరిగెత్తుకుంటూ వెళ్లి తనను కౌగిలించుకున్నాడు వినోద్ .
Advertisements