Advertisement
ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు.. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది…ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య.. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.. బెడిసికొట్టింది..ఇక లాభంలేదు..నా భార్య గురించి నాకే తెలుసు..నేనే నా భార్య కోపాన్న పోగొడుతాను అంటూ రంగంలోకి దిగాడు ఆ భర్త..ఇంతకీ ఏం చేశాడో తెలుసా?? పాట పాడాడు.. పాటా పాడాడా అంటూ నోరు తెరవకండి..అవును భార్య కోపాన్ని పోగొట్టడానికి పాట పాడాడు..
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు..దాంతో భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది భార్య..పెద్దలతో రాయబారం నడిపాడు భర్త.. వినలేదు..ఇక తనతో కలిసి బతికేది లేదంటూ తెగేసి చెప్పంది..పోలీస్ స్టేషన్ కి భర్తని పిలిచి మాట్లాడారు పోలీసులు..నాకు నా భార్య కావాలని భర్త.. ఈ భర్త నాకొద్దంటూ భార్య..
Advertisement
ఇదెక్కడి గోల రా బాబూ అనుకుంటూ ఇద్దరిని కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వమని చెప్పారు..కౌన్సిలింగ్ లో ఎంత నచ్చచెప్పినా భార్య వినలేదు..దాంతో భర్త లేచి భార్య ముందు నిల్చుని బద్లాపూర్ సినిమాలోని పాట అందుకున్నాడు..భర్త పాటకి అక్కడున్న వాళ్లందరూ షాక్ అవ్వగా భార్య మాత్రం తన్మయత్వంతో తన భుజంపై వాలిపోయి కన్నీటిపర్యంతమైంది.. వీరిద్దరి ప్రేమవిజయాన్ని వీడియోలో బంధించి ట్విటర్ లో షేర్ చేసాడు ఐపిఎస్ మధుర్ వర్మ.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Watch Video:
Advertisements
A couple had a fight.
Few months back, wife filed a case against her husband in Jhansi.
But husband sang a song for her in the police station and convinced her. Love triumphs pic.twitter.com/2frzPOKpGn— Madhur Verma (@IPSMadhurVerma) November 14, 2017
Advertisements