Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

హైదరాబాద్ లోని ఈ 15 ప్రాంతాల‌కు ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయో తెలుసా..?

Advertisement

హైద్రాబాద్ కు ఘ‌న‌మైన చారిత్రాక‌త్మ‌క నేప‌థ్యం ఉంది!హైద్రాబాద్ కు ఘ‌న‌మైన చారిత్రాక‌త్మ‌క నేప‌థ్యం ఉంది!  చాలా ఏళ్ల పాటు కుతుబ్ షాహీలు, నిజాం రాజులు ప‌రిపాలించ‌డంతో ఇక్క‌డి ప్రాంతాల‌కు వాళ్ల‌కు సంబంధించిన పేర్లు క‌నిపిస్తుంటాయి.! హైద్రాబాద్ లో మ‌నం పిల్చుకునే ఆ ఏరియాల‌కు….ఆ పేర్లు ఎలా వ‌చ్చాయో దాని చ‌రిత్రేంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం!

1. బేగంపేట్

6వ నిజాం  మహబూబ్  అలీఖాన్ త‌న కుమార్తె బ‌షీర్ ఉన్నిస బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు..కూతురికి క‌ట్నం కింద‌ ఒక స్థలాన్ని  కట్నంగా  ఇచ్చాడు . ఆ స్థలానికి  బషీర్ ఉన్నిసా బేగం  పేరు  మీదగా  బేగంపేట  అని  పేరు వచ్చింది.

2. చార్మినార్

Advertisements

కులికుతుబ్ షా  కట్టిన  ఈ కట్టడానికి  ప్రధాన  ఆకర్షణ నాలుగు స్థంబాలు…..ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు…వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వ‌చ్చింది!

3. సికింద్రాబాద్

మూడో  నిజాం  సికిందర్ ఝా  పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్  అనే  పేరు  వచ్చింది . అంతకుముందు  సికింద్రాబాద్ ని  లష్కర్  అని  పిలిచే వారు.

4.ఖైరతాబాద్

ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.

5. శంషాబాద్

షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వ‌చ్చింది. ష‌మ్స్ అంటే సూర్యుడు. దీని అర్థం ప్ర‌భువుల యందు సూర్యుడిలాంటి వాడని…. ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు క‌ల‌దు.!

6. నాంపల్లి

నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాంగా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై అతని పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాఖరకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది.

7. హిమయత్ నగర్

Advertisement

1933 లో  ఏడవ నిజాం  ఉస్మాన్  అలీఖాన్  యొక్క పెద్ద కుమారుడు   హిమాయత్  అలీ ఖాన్  ఆస‌ఫ్ జా పేరు  మీద  ఆ స్థలానికి  హిమాయత్ నగర్  అని  పేరు వచ్చింది.

8. అబిడ్స్

ఆల్బర్డ్  అబిడ్  అనే  ఒక ఆర్మేనియా  వ్యాపారికి  ఆ ప్రాతంలో  ఒక దుకాణం  ఉండేది.  అందుకే  ఆ ప్రదేశాన్ని  అబిడ్స్  అని  పిలుస్తూ  ఉంటారు .  తర్వాత  కొంతకాలానికి  ఆల్బర్డ్ అబిడ్  ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది!

9. సోమాజిగూడ

నిజాం కాలంలోని రెవెన్యూ  డిపార్ట్మెంట్  అధికారైన సోనాజీకి  కొన్ని  భూములుండేవి .  సోనాజీ కాస్త సోమాజి  అయింది.  గూడ  అంటే  చిన్న  గూడెం  లేదా ప్రాంతం  అని  అర్ధం. రెండు క‌లిపి సోమాజిగూడ అయ్యింది!

10 . మాసబ్ ట్యాంక్

6 వ కుతుబ్ షాహ్  భార్య  హ‌యత్  భ‌క్షిభేగంను  మాసాహెబా  అని  పిలిచేవారు.  మాపల్లె భూములకు  సాగునీరు  ఇవ్వడానికి  ఆమె  ఒక ట్యాంక్  నిర్మించింది .  ఆ ట్యాంక్  పేరు  మాసాహెబా తలాబ్  అని  పిలిచేవారు . చివరకు  ఆ పేరు మాసబ్ ట్యాంక్  అయింది .

11. హైదరాబాద్

కులీకుతుబ్ షా భార్య  భాగమతి  వివాహం  తర్వాత తన  పేరుని  హైదర్ మహల్ గా  మార్చుకున్నారు . హైదర్ మహల్  అంటే  హైద్రా నగరం  అని  అర్ధం తర్వాత  ఆ పేరు  మీద  హైదరాబాద్ గా  మారింది .

12 .మలక్ పేట్

గోల్కొండ  రాజు అబ్దుల్  కుతుబ్ షా  యొక్క  సేవకుడు మాలిక్ యాకుబ్  పేరు  మీదగా  ఈ ప్రదేశానికి  మలక్ పేట్  అనే  పేరు  వచ్చింది.

13 . బషీర్ బాగ్

బసిరుద్దౌలాకు   హైద్రాబాద్ లో   ఒక ప్యాలెస్  ఉండేది .  ఆ ప్యాలెస్  దగ్గర  పెద్ద గార్డెన్  ఉండేది . బసిరుద్దౌలా  పేరు  మీద  ఆ ప్రదేశానికి  బషీర్ బాగ్  అనే  పేరు  వచ్చింది.  బాగ్ అంటే  గార్డెన్  అని  అర్ధం .

14. ఫలక్ నుమా

ఫలక్  అంటే  ఆకాశం ,  నామ  అంటే  అద్దం .  ఈ ప్రదేశం  అంతా  కొండలతో  ఎంతో  ఎత్తుగా  ఉండేది . కాబట్టి  ఆకాశానికి  అద్దం  అనే అర్థం  వచ్చేలా  ఫలక్ నామ అని  పేరు  పెట్టారు . ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!

15 . సరూర్ నగర్

Advertisements

హైదరాబాద్  ప్రధానమంత్రి  అషుర్ జా  భార్య  సరూర్ అఫ్జ‌ల్  పేరు  మీద  ఆ ప్రదేశానికి  సరూర్ నగర్  అనే పేరు  వచ్చింది.