Advertisement
భారతదేశానికి స్వాతంత్య్రం లభించాక దేశవ్యాప్తంగా ఉన్న సంస్థానాలన్నీ దాదాపుగా ఒక్కొక్కటే భారత దేశంలో కలిశాయి. 1948వ సంవత్సరం వరకు దాదాపు అన్ని సంస్థానాలను భారత్‌లో విలీనం చేశారు. ఈ బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వర్తించారు. అయితే భారత దేశంలో కలిసేందుకు అప్పటి నిజాం ఒక్కడే వ్యతిరేకించాడు. దీంతో అప్పట్లో హైదరాబాద్ సంస్థానం దేశంలో కలవడం కొంత వరకు ఆలస్యం అయింది.
1713లోనే హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా మొఘల్ చక్రవర్తుల కాలంలో కొనసాగింది. అప్పటి నుంచి నిజాంలు హైదరాబాద్‌ను పాలించారు. 1947 తరువాత బ్రిటిషర్లు దేశంలోని సంస్థానాలను భారత్‌లో కలవాలా, పాక్‌లో కలవాలా లేదా స్వతంత్రంగా ఉండాలా.. అనే నిర్ణయాన్ని సంస్థానాలకే వదిలేసి వెళ్లారు. అయితే 1948 వరకు దాదాపుగా మొత్తం సంస్థానాలన్నీ భారత్‌లో కలిశాయి. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇంకా భారత్‌లో కలవలేదు. ఇక నిజాం మాత్రం హైదరాబాద్‌ను ఇండియాలో కలిపేందుకు ఏమాత్రం ఇష్టపడలేదు. పైగా అప్పట్లో మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో కొత్తగా ఏర్పడ్డ పాకిస్థాన్ దేశానికి నిజాం లోన్ కూడా ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ పాకిస్థాన్‌లో కలుస్తుందేమోనని, అది దేశానికి ప్రమాదమని భావించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్‌ను ఎలాగైనా సరే భారత్‌లో కలపాలని ఆర్మీని రంగంలోకి దించారు.
Advertisement
1948 జూన్ 21న లార్డ్ మౌంట్ బాటన్ ఇండియా వైశ్రాయ్‌గా రాజీనామా చేశారు. అప్పటికే మౌంట్ బాటన్.. నిజాంను భారత్‌లో కలవాలని, రాజీపడి ఇండియా ప్రజలతో జీవించాలని నిజాంకు సూచించాడు. అయినప్పటికీ నిజాం వినలేదు. ఈ క్రమంలో నిజాం తనదైన పారామిలిటరీ ఫోర్స్ అయిన రజాకార్లను హైదరాబాద్‌లో గల్లీ గల్లీలో మోహరించాడు. ఎవరైనా ఎదురు తిరిగితే నిర్దాక్షిణ్యంగా తుపాకులు, గన్‌లతో చంపేవారు. ఈ క్రమంలో వల్లభాయ్ పటేల్ అదే ఏడాది సెప్టెంబర్ 13న భారత ఆర్మీని హైదరాబాద్‌కు పంపాడు. 4 రోజుల వ్యవధిలో భారత ఆర్మీ రజాకార్లను అణచివేసి హైదరాబాద్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ పోరులో 42 మంది సైనికులు, 2వేల మంది రజాకార్లు చనిపోయారు.
Advertisements
Advertisements
సెప్టెంబర్ 17న నిజాం రేడియో ద్వారా రజాకార్లకు సూచన చేశాడు. భారత్‌లో హైదరాబాద్ విలీనం అవుతుందని, అందరం ఇండియా ప్రజలతో శాంతితో జీవిద్దామని పిలుపునిచ్చాడు. అనంతరం వల్లభాయ్ పటేల్‌కు భారత దేశాన్ని చిన్న చిన్న దేశాలుగా కాకుండా ఒకే దేశంగా కలిపినందుకు క్రెడిట్ దక్కింది. ఆయన ఆ పనిచేయకుండా ఉంటే భారత్ 550 చిన్నదేశాలుగా మారి ఉండేది. ఇప్పటికీ సంస్థానాల పాలన కొనసాగి ఉండేది. పటేల్ చేసిన కృషి వల్లనే భారతీయులందరం విడిపోకుండా కలసి మెలసి ఉంటున్నాం.