Advertisement
మీ జీవితంలో అత్యంత మధురమైన రోజు ఏది అంటే నేను ధోనిని కలిసిన రోజే..అవును నేను తనని కలిసాను..ఈ మాట నాకు నేను ఎన్ని సార్లు చెప్పుకున్నానో లెక్కేలేదు.. ధోనికి ఉన్న కొన్ని కోట్లమంది అభిమానుల్లో నేను ఒకదాన్నైనందుకు ఎప్పుడూ సంతోషించేదాన్ని..కానీ తనని కలిసాక తనకు అభిమానినయినందుకు గర్వపడుతున్నాను నిజానికి దీనికన్నా కొన్ని నెలల ముందే నేను మహిని కలిసుండాల్సింది.. కానీ బ్యాడ్ లక్ మిస్ అయింది..కానీ అప్పుడు మిస్ అవ్వడమే మంచిది అయింది అని తర్వాత అర్దమయింది..
మార్చి 2018 లో మాహి ఒక టోర్నమెంట్ ఫైనల్ కోసం సూరత్‌కు రాబోతున్నాడని, అక్కడే ఉన్న సెవెన్ స్టోర్స్ ని సందర్శిస్తున్నాడని తెలిసింది..ఎలా అయినా మాహిని కలవాలనుకుంటున్న నాకు ఒక రోజు ఓ మెసేజ్ వచ్చింది..సెవెన్ స్టోర్ వాళ్లు తీసిని లక్కీ డ్రాలో మాహిని కలిసే అవకాశం దక్కించుకున్నారని ఆ మెసేజ్ సారాంశం.. నా అదృష్టానికి నేనే పొంగిపోయాను..
మాహిని కలిసే రోజు రానే వచ్చింది..మద్యాహ్నం రెండు గంటలకు టైం.. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి..డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను..కానీ 10గంటలకు సెవెన్ స్టోర్ నుండి కాల్ వచ్చింది మహి రావట్లేదని..అంతే ఆ కాల్ మాటలు వింటూనే కుప్పకూలిపోయాను..మాహిని కలవలేకపోయాననే బాధతో ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను..మరుసటి రోజు నాకు పరీక్ష అనే విషయం కూడా మర్చిపోయి బాధపడుతూనే ఉన్నాను.
Advertisement
జూన్ లో మళ్లీ సెవెన్ స్టోర్ వారినుండి కాల్ వచ్చింది..లక్కీ డ్రాలో గెలిచిన వారిని మహిని కలిసే ఏర్పాటు చేస్తున్నాం.కలిసి ఒక ఫోటో దిగడానికి అనుమతి ఉంది…కాకపోతే ముంబాయి రావల్సి ఉంటుంది అని..మహిని కలవడానికి ముంబై ఏం కర్మ, సప్తసముద్రాలు దాటొస్తాను అంటూ ఎగిరి గంతేసినంత పనిచేశాను..నాన్నని తోడుగా తీసుకుని ముంబైకి వెళ్లాను…మహి కోసం దాచిన ఒక గిఫ్ట్ కూడా భద్రంగా బ్యాగ్లో పెట్టుకున్నాను..
Advertisements
ముంబాయ్ లో ఒక యాడ్ షూటింగ్ లో ఉన్నాడు ధోని..షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చి మా ముందు ఉన్న బెంచ్ పై కూర్చున్నాడు..లక్కి డ్రాలో గెలిచిన వారిని వచ్చి ఫోటో దిగి వెళ్లమంటూ అనౌన్స్ చేశారు.. అందరూ వెళ్తున్నారు..నేను ఆగిపోయాను..అందరూ మహి దగ్గరకు వెళ్లి ఫోటో దిగి వెళ్లిపోయారు..తనని చూస్తూనే నేను గట్టిగా అరిచేసాను,నాకు తెలియకుండానే ఏడుపొచ్చేస్తుంది..ఇది బాధతో వచ్చేది కాదు..కానీ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు..నేను వెళ్లి మహి పక్కన కూర్చున్నాను..నేను ఎందుకు ఏడుస్తున్నానో ఎవరికి అర్దం కావట్లేదు.. మహి స్టాఫ్ నన్ను ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు..ఇది కల కాదు అని సర్ది చెప్తున్నరు..
అందరికి కలిపి ఒక నిమిషం మాత్రమే టైం ఇచ్చారు..కానీ నేను సుమారు పది నిమిషాలపాటు మహి పక్కన కూర్చుని ఏడుస్తూనే ఉన్నాను..ఆ టైం తనకెంత విలువైందో నాకు తెలుసు..అయినా కూడా నా వల్ల కావట్లేదు.. “వైదేహి ఏడుపు ఆపు అంటూ మాహి నన్ను ఊరుకొబెడుతున్నాడు.. నువ్వు ఇలాగే ఏడిస్తే ఫోటోలు బాగా రావు” అంటూ ఊరడిస్తున్నాడు..నేను ఒక్కసారిగా నవ్వేసాను.. నాకిష్టమైన వ్యక్తి పక్కన కూర్చోవడం నేనెప్పటికి మర్చిపోలేను..ఇది కొందరికి పిచ్చిగా అనిపించొచ్చు..కానీ నా వరకు ఆ క్షణాలు ఎంత విలువైనవి అనేది కేవలం మహేంద్రసింగ్ ధోని ఫ్యాన్స్ కి మాత్రమే అర్దం అవుతుంది.. చివరికి తన కోసం తెచ్చిన గిఫ్ట్ ని బ్యాగ్ లో నుండి తీసి తనకి ఇచ్చాను.. నేను తన గురించి రాసిన కవితల పుస్తకం ..నేను రాసిన పుస్తకం తన చేతుల్లో..!
Advertisements