Advertisement
మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులను నియంత్రిస్తుందని తెలిసిందే. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని నియంత్రిస్తుంది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ కరెన్సీ నోట్లను కూడా ప్రింట్ చేస్తుంది. అయితే కేవలం ఒక్క రూపాయి నోటును మాత్రం భారత ప్రభుత్వం ముద్రిస్తుంది. ఇక ఈ సంగతి అటుంచితే.. కరెన్సీ నోట్ల మీద I Promise to pay the bearer sum of Rupees అని రాసి ఉంటుంది గమనించారు కదా.. అలా ఎందుకు రాసి ఉంటుంది అంటే..?
సాధారణంగా ఆర్‌బీఐ దేశంలో చెలామణీలో ఉన్న నగదుకు సమానమైన బంగారం నిల్వలను కలిగి ఉంటుంది. ఏటా ఆ నిల్వలు పెరుగుతుంటాయి. దీంతో అందుకు సమానంగా ఆర్‌బీఐ కరెన్సీని ప్రింట్ చేస్తుంటుంది. అయితే ఒక కరెన్సీ నోటు ఒక వ్యక్తి వద్ద ఉంటే.. దానిపై I Promise to pay the bearer sum of Rupees అని రాసి ఉంటుంది కనుక ఆ వ్యక్తి ఆర్‌బీఐ నుంచి ఆ కరెన్సీ నోటుకు సమానమైన విలువ కలిగిన బంగారాన్ని లేదా వస్తువులను తీసుకోవచ్చు. అంటే.. ఆ కరెన్సీ నోటు విలువకు పూర్తి బాధ్యత ఆర్‌బీఐదేనన్నమాట. అందుకనే దానిపై ఆ అక్షరాలు రాసి ఉంటాయి.
Advertisement
ఇక ఆర్‌బీఐ ప్రింట్ చేసే నోట్ల మీద ఆ అక్షరాలతోపాటు కింద ఆర్‌బీఐ గవర్నర్ సంతకం కూడా ఉంటుంది. అంటే ఆ నోట్లు ప్రామిసరీ నోట్ల లాంటివన్నమాట. అందువల్ల ఆ నోట్లకు పూర్తి బాధ్యత ఆర్‌బీఐదే. ఆ నోట్లను కలిగి ఉన్నవారు ఆర్‌బీఐ నుంచి అంతకు సమానమైన బంగారం లేదా వస్తువులను తీసుకోవచ్చు. దీంతో వారు తమ వద్ద ఉన్న కరెన్సీ నోట్లకు విలువ ఉంటుందా, ఉండదా.. అని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నమాట. ఆ నోట్లకు విలువ ఉంటుందని, అందుకు ఆర్‌బీఐ బాధ్యత వహిస్తుందని చెప్పడానికే ఆ అక్షరాలను కరెన్సీ నోట్లపై ముద్రించడం మొదలు పెట్టారు.
Advertisements
Advertisements
ఇలా ఆర్‌బీఐ 1935లో తొలిసారిగా ఏర్పాటైనప్పటి నుంచి కరెన్సీ నోట్లపై అలా ముద్రించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కరెన్సీ నోట్లను తీసుకునేందుకు ఎవరైనా నిరాకరిస్తే చట్ట ప్రకారం వారు శిక్షార్హులవుతారు.