Advertisement
ఆత్రేయ అన్నట్టు పెళ్లంటే పందిళ్లు… సందిళ్లు..తప్పట్లు..తాళాలు.. తలంబ్రాలూ ఎంత పేదవాడైనా జీవితంలో జరిగే సంబరం పెళ్లిని ఇలాగే చేస్కుంటారు..కానీ ఐఏఎస్-ఐపీఎస్ జంట చాలా సింపుల్ గా పెళ్లి కానిచ్చింది.. పెళ్లంటే చెలిమికి సంకెళ్లు వెయ్యేళ్లు అని అర్దం వచ్చేలా తమ బంధాన్ని నిలుపుకున్నారు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్… తుషార్ సంగ్లా, నవజోత్ సిమి..
వేర్వేరు నేపధ్యాలు-వేర్వేరు కేడర్లు:
తుషార్ సంగ్లా 2015 బ్యాచ్ ఐఏఎస్.. నవజోత్ సిమి 2018 కేడర్ ఐపిఎస్..ఇద్దరివి వేర్వేరు కాడర్లు..వేర్వేరు నేపధ్యాలు.. ఇద్దరిది పంజాబ్..కానీ పంజాబ్ లో వాళ్లెప్పుడూ కలుసుకున్నది లేదు.. తుషార్ ఐఐటి ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సివిల్స్ వైపు వచ్చాడు. ప్రస్తుతం కోల్ కతా లోని ఉలుబేరియాలో ఎస్ఓడిగా పనిచేస్తున్నాడు..
Advertisements
నవజోత్ విషయానికి వస్తే బాలివుడ్ హీరోయిన్స్ ని మించిన అందం, అందమైన అమ్మాయిలు ఎక్కువగా మోడలింగ్ వైపు వెళ్తారు..కానీ నవజోత్ పూర్తి భిన్నం.. బిడిఎస్ చేసింది..డెంటిస్ట్ గా కెరీర్ కూడా స్టార్ట్ చేసింది.. పెళ్లెప్పుడు పెళ్లెప్పుడూ అని చుట్టాలు పోరుతుంటే వాళ్ల మాటల్ని తప్పించుకోవడానికి సివిల్స్ కోచింగ్ జాయిన్ అయింది.. సివిల్స్ ర్యాంక్ కొట్టి ఐపిఎస్ గా ఎంపికయి ప్రస్తుతం పాట్నాలో విధులు నిర్వర్తిస్తుంది..
Advertisement
పరిచయం:
తుషార్ ,నవజోత్ ఇద్దరూ వారి వారి విధుల్లో ఉన్నప్పుడు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు..అక్కడే మొదటిసారి పరిచయం ఏర్పడింది..ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో పరిచయం ప్రేమగా మారింది..తమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకోవలనుకున్నరు..కానీ నవజోత్ పాట్నాలో, తుషార్ కోల్ కతా లో.. వారిద్దరికి అది పెద్ద దూరం కాదు..కానీ తుషార్ ధోరణి వేరు..
డ్యూటీ ఫస్ట్,పర్సనల్ లైఫ్ నెక్ట్స్ అనుకునే తుషార్ కి పంజాబ్ రావడానికి టైమే దొరక్కపోవడంతో..తుషార్ కోసం నవజోత్ పాట్నా నుండి కోల్ కతా కు వెళ్లింది..రెండు ఫ్యామిలిస్ తో కలిసి వెళ్లి అక్కడే తుషార్ ఆఫీస్లోనే పెళ్లి చేసుకుంది.. రెండు కుటుంబాలు,రిజిస్ట్రార్, ఆఫీస్ స్టాఫ్ మధ్య ఇద్దరూ ఒక్కటయ్యారు..ఇదంతా జరిగింది ఫిబ్రవర్ 14 ప్రేమికుల రోజున..మళ్లీ ఎవరు విధుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు..నవజోత్ కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాములుగా లేదు..వీళ్ల ప్రేమపెళ్లి తర్వాత మరింత పాపులర్ అయ్యారు..
పెళ్లంటేనే బంధువులు, ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ లాంటిది.. అలాంటి పెళ్లి సింపుల్ గా కానిచ్చేశారు.. కానీ పెళ్లయ్యాక దావత్ ఉండాల్సిందే కదా..వీళ్ల పెళ్లి దావత్ కూడా ఉంది..కాకపోతే ఏడాది తర్వాత.. 2021లో పశ్చిమబెంగాల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక ఇద్దరూ తమ కేడర్లు మార్చుకుని ఒకే రాష్ట్రంలో పనిచేసేలా ఏర్పాటు చేసుకున్నాక అందరికి గ్రాండ్ గా రిసెఫ్షన్ ఏర్పాటు చేస్తారట…అదండీ మోస్ట్ ఫర్ఫెక్ట్ కపుల్ కథ.!
Advertisements