Advertisement
ఐఏఎస్ టాపర్లు టీనా దాబీ, ఆమె భర్త అథర్ ఖాన్‌లు విడాకుల కోసం అప్లై చేశారు. 2018లో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా ఇరువురి పరస్పర అంగీకారంతో జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు.
కాశ్మీర్ కు చెందిన అథర్ ఖాన్ 2015లో యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో ఆలిండియా లెవల్‌లో 2వ స్థానం సంపాదించాడు. దీనా దాబీ కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ టాపర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఇద్దరూ ట్రెయినింగ్‌లో స్నేహితులయ్యారు. తరువాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం వివాహం చేసుకున్నారు.
Advertisement
ఇక ఇరువురికీ జైపూర్‌లోనే పోస్టింగ్ లభించింది. వీరిద్దరూ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారులు. అయితే వీరిద్దరి వివాహ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వారికి అప్పట్లో శుభాకాంక్షలు తెలిపారు. కానీ తరువాత ఇద్దరూ పలు సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. అయినప్పటికీ కొంత కాలం కలసి ఉన్నారు. ఇక ఇప్పుడు ఇద్దరూ విడిపోయి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరు తాజాగా మరోమారు వార్తల్లో నిలిచారు.
Advertisements
పెళ్లి తర్వాత తన పేరు పక్కన ఖాన్ ను యాడ్ చేసుకున్న టీనా తర్వాత తొలగించారు. అలాగే అత్తర్ ఖాన్ సైతం ఇన్స్టాగ్రాం లో టీనా ను అన్ ఫాలో చేశాడు.
ఆర్టికల్ 370 రద్దే వీరి గొడవకు కారణమా?
Advertisements
వీరి విడాకులకు ఆర్టికల్ 370 రద్దు ఓ కారణం కావొచ్చనే యాంగిల్ లో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే అత్తర్ ఖాన్ కాశ్మీర్ కు చెందిన పౌరుడు…370 మరియు 35A రద్దును వ్యతిరేఖించేవాడని అదే సమయంలో టీనా వాటికి సపోర్ట్ చేసేదని…దాంతో అభిప్రాయబేధాలు వచ్చాయనే చర్చ జరుగుతుంది. నిజంగా ఇదేనా ఇంకేమైనా కారణాలున్నాయా అనేది మాత్రం తెలియదు.