Advertisement
గాల్వాన్ లోయ ఘటన తర్వాత…ఇండియా చైనా దేశాల మద్య యుద్దం వాతావరణం నెలకొని ఉంది ! యుద్దమే జరిగితే…… ఇండియా- చైనాలు అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాలు కాబట్టి రెండు వారాల్లో అంతా నాశనమవుతుంది. కోలుకోడానికి కొన్ని యేళ్ళ సమయం పడుతుంది.! ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. కాబట్టి రెండు దేశాలు ఈ సమస్యను చర్చలతోనే పరిష్కరించుకోవాలి అనేది విశ్లేషకుల మాట.!
యుద్దమే అనివార్యమైతే …ఏ దేశాల సపోర్ట్ ఎటువైపు ( అంచనా):
పాకిస్థాన్ : నో సెకండ్ థాట్…వీళ్ల సపోర్ట్ చైనాకే.! శత్రువు శత్రువు మనకు మిత్రుడు అనే పాలసీ ప్రకారం వీరు చైనా వైపు ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా స్థిరంగాలేని పాక్….. చైనాకు సపోర్ట్ చేసి తమ దేశ స్థితిని మరింతగా దిగజార్చదు. వీలైతే తటస్థంగా ఉండే అవకాశముంది.
Advertisements
Advertisement
రష్యా : రష్యా తటస్థంగా ఉండే అవకాశముంది.! ఎందుకంటే ప్రస్తుతం రష్యా రెండు దేశాలతో సత్సంబంధాలను మెయింటేన్ చేస్తుంది. యుద్దం వద్దు అనే కోరుకుంటుంది.
అమెరికా : అవుట్ అండ్ రైట్ మనకే సపోర్ట్ చేస్తుంది.
- అమెరికా సైనిక దళాలు దక్షిణ చైనా సముద్రంలో మాటువేయవచ్చు.
- NRO, NSA , CIA లు భారత్‌కు అవసరమైన శాటిలైట్, ఎలక్ట్రానిక్ సహాయం, సిగ్నల్స్, నిఘా సహకారం అందించవచ్చు.
- పెంటగాన్ భారత్‌కు అవసరమైన యాంటీ ఎయిర్, యాంటీ యాక్సెస్, ఏరియా డిఫెన్స్ వెపన్ సిస్టమ్‌ను అందజేయవచ్చు.
- దీంతోపాటు సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ దేశాలు చైనాకు ముడి చమురును సరఫరా చేయకూడదని అమెరికా ఆయా దేశాలపై ఆంక్షలు విధించవచ్చు.
Advertisements
బ్రిటన్ , ఇజ్రాయెల్ లు కూడా ఇండియా వైపే మొగ్గుచూపుతాయి.!