Advertisement
మ్యాచ్ టై అయితే ….సూపర్ ఓవర్ ద్వారా విజేతను డిసైడ్ చేస్తారు! మరి ఆ సూపర్ ఓవర్ కూడా టై అయితే ఏం చేస్తారు.? ఈ డౌట్ నిన్నటి KXIP V/s MI మ్యాచ్ తర్వాత అందరికీ వచ్చింది.! సెకండ్ సూపర్ ఓవర్ ఆడించడంతో ఆ డౌట్ క్లియర్ అయ్యింది…మరి సెకండ్ సూపర్ ఓవర్ కూడా టై అయితే అప్పుడేం చేస్తారు? ఈ విషయాన్ని ఇప్పుడు తెల్సుకునే ప్రయత్నం చేద్దాం!
మ్యాచ్ టై అయితే:
మ్యాచ్ టై అయితే ….సూపర్ ఓవర్ ఆడిస్తారు. ఇరు జట్లు తమ టీమ్ తరఫున బ్యాటింగ్ చేసే ముగ్గురి పేర్లను, ఒక బౌలర్ పేరును ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది! ఒకసారి పేర్లిచ్చాక ఎట్టి పరిస్థితుల్లో మార్పు కుదరదు.
- రెండే వికెట్లు ఉంటాయి.
- నలుగురు ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ లో ఖచ్చితంగా ఉండాలి.!
- సూపర్ ఓవర్ లో ఛేజింగ్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేస్తుంది.
- మ్యాచ్ ముగిసే సమయానికి ఏ ఎంపైర్ ఎటు ఉన్నారో…ఈ సూపర్ ఓవర్లో కూడా అలాగే ఉంటారు. వీరు ప్లేస్ మారరు.
Advertisement
మరి సూపర్ ఓవర్ కూడా టై అయితే…?
గతంలో సూపర్ ఓవర్ టై అయితే….ఇరుజట్లు కొట్టిన బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించేవారు. 2019 వరల్డ్ కప్ లో ఇలాగే ఇంగ్లాడ్ ను విజేతగా ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఐసిసి ఈ నిబంధన మార్చింది. సూపర్ ఓవర్ టై అయితే మరో సూపర్ ఓవర్ ను ఆడిస్తారు.
Advertisements
సెకండ్ సూపర్ ఓవర్ నిబంధనలేంటి?
మొదటి సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసిన మరియు బౌలింగ్ చేసిన ఆటగాళ్లకు….రెండో సూపర్ ఓవర్లో ఆ అవకాశముండదు…అందుకే నిన్నటి మ్యాచ్ లో రాహుల్, పూరన్ కాకుండా గేల్ , మయాంక్ దిగారు. అలాగే బుమ్రా, షమీలు కాకుండా జోర్డాన్ , బౌల్ట్ లు బౌలింగ్ చేశారు. మిగితా నిబంధనలన్నీ సూపర్ ఓవర్ లాగానే ఉంటాయి.
Advertisements
సెకండ్ సూపర్ ఓవర్ కూడా టై అయితే..?
మ్యాచ్ లు గ్రూప్ దశలో ఉంటే….ఇరుజట్లకు చెరి సగం పాయింట్లను కేటాయిస్తారు. అలా కాకుండా సెమీ ఫైనల్ , ఫైనల్ మ్యాచ్ లు అయితే రిజల్ట్ వచ్చే వరకు సూపర్ ఓవర్ ఆడిస్తూనే ఉంటారు.