Advertisement
ఇతర దేశాల్లో ఏమో గాని మన ఇండియాలో ఫోన్ వాడే విధానం చూసి ఫోన్ మీద జాలేస్తూ ఉంటుంది. ఇక కొందరు ఫోన్ ని ఎన్నో కలలతో కొంటూ ఉంటారు. వాళ్లకు ఫోన్ ఎక్కువ కాలం ఎలా రావాలి…? దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీదనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఒక ఏడు సూత్రాలు…
Also Read:గూగుల్ లో జాబ్ కావాలంటే డిగ్రీ అవసరం లేదా…? గూగుల్ ఆలోచన ఎలా మారింది…?
పిల్లలు ఫోను వాడుతున్నపుడు మన పర్యవేక్షణలోనే ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. బ్యాటరీ స్థాయిని జాగ్రత్తగా గమనిస్తూ 15 శాతం కన్నా తగ్గినపుడు వాడకుండా… చార్జింగ్ పెట్టుకోవడం చాలా మంచిది.
చార్జింగ్ పెట్టడానికి సాధ్యమైనంతవరకు ఆ ఫోనుతో పాటు వచ్చిన చార్జర్ మాత్రమే వాడాలి. పోతే ఆ కంపెనీ చార్జర్ మాత్రమే కొని వాడుకోవాలి గాని బీసెంట్ రోడ్, కోటీ చార్జర్ లు వాడకూడదు. ఒక వేళ చార్జరు పాడైతే కొంచెం ఎక్కువ ధర అయినా మంచిది కొనాలి.
Advertisements
Advertisement
అవసరం లేనపుడు ఫోనులో డేటా, వైఫై, బ్లూటూత్, జిపిఎస్ లాంటి బ్యాటరీ పవర్ వాడుకునే ఫీచర్లను ఆపేస్తే చాలా మంచిది.
డేటా ఆన్ లో ఉండాలి అనుకునే వారు… సోది యాప్స్ అన్నింటికీ నోటిఫికేషన్ లు ఆన్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ తినేసే అవకాశం ఉంది.
అప్పుడప్పుడు స్క్రీను క్లీనింగ్ లిక్విడ్, మెత్తటి గుడ్డతో శుభ్రం చ్చేసుకుంటూ ఉండాలి. జేబులో పెట్టుకునేటపుడు, అందులో స్క్రీన్ మీద గీతలు పడే వస్తువులు లేకుండా చూడాలి. అవి పగిలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అనవసరమైన ఆప్ లు అన్- ఇన్‌స్టాల్ చేయడం చాలా మంచిది.
బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్న వాటిని అవసరం లేకపోతే ఆపేయడం ఉత్తమం. బ్యాటరీ ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంది.
Advertisements
Also Read:ఏ వాషింగ్ మెషిన్ బెస్ట్…? ఫ్రంట్ లోడ్ ఆర్ టాప్ లోడ్…? బట్టలు ఎక్కువ కాలం ఉండాలంటే అదే…!