Advertisement
“ఆఫీస్ లో నా క్యాబిన్ లోకి వెళ్తూ గోడకు తగిలించి ఉన్న ఈ నేమ్ బోర్డ్ ను చూసి ఒక్కసారిగా ఆగిపోయాను. దాన్ని కాసేపు అలాగే చూస్తుండిపోయాను.! నా పేరు ముందు శ్రీమతి అనే పదాన్ని చూసి నవ్వుకున్నాను.! అవును ఇప్పుడు నేను శ్రీమతి కదా.! కానీ ఏం మారింది…..అప్పటికీ ఇప్పటికీ.!
నేను పెళ్లి చేసుకున్నది నేను ప్రేమించిన వ్యక్తినే ., నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తినే…. అప్పుడెలా చూసుకున్నాడో ఇప్పుడూ అలాగే చూసుకుంటున్నాడు. అతని ప్రేమలో ఏ మార్పు లేదు. మా హోదాలు పెరిగాయి అంతే… 2017 లో సివిల్స్ సాధించిన తర్వాత నేను భద్రాద్రి కొత్తగూడెం అసిస్టెంట్ కలెక్టర్ ఆయన భద్రాచలం సబ్ కలెక్టర్ పోస్టింగ్ పొందాం.! నా జీవితం ఇంత గొప్పగా ఉందటే దానికి కారణం మా ఆయనే.! సో …. గర్వంగా ఉంది.”
ఇలా త్రిపాఠి నేపథ్యం:
Advertisement
ఇలా త్రిపాఠి లక్నో లో పుట్టి పెరిగారు. తండ్రి IFS ఆఫీసర్.. త్రిపాఠి గారు ఇంజనీరింగ్ తర్వాత ఉన్నత చదువుకోసం విదేశాలకు వెళ్లారు కొన్నేళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేసి సివిల్స్ రాయాలనే ఆలోచనతో ఇండియాకు వచ్చారు. కష్టపడి చదివి 2017 లో సివిల్స్ క్లియర్ చేశారు.
Advertisements
ప్రస్తుతం ఆమె తన భర్త భవిష్ మిశ్రాతో కలిసి… భద్రాచలంలో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆదివాసులకు విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : సివిల్స్ తెలుగులో రాసుకోవొచ్చా.? పూర్తి సమాచారం మీకోసం.
Also Read: ఆయన కలెక్టర్ ..ఆమె డాక్టర్ …పెళ్లిలో సార్ అడిగిన కట్నం హైలెట్ .!
Advertisements
Also Read : వాట్సాప్ లో షేర్ అవుతున్న ఫోటో…..ఇది ఫేక్…మరి నిజమేంటంటే.!