Advertisement
హిందు సాంప్రదాయంలో ఉండే ఆచారాలకు సంబంధించి ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో కొందరికి కొన్ని భయాలు ఉన్నాయి. ఇక వాటి గురించి ప్రచారాలు కూడా అలాగే భయపెడుతూ ఉంటాయి. ఇదెలా ఉంటే హారతి కళ్ళకు అద్దుకోవచ్చా లేదా అనే విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఎందుకు అద్దుకోవాలో ఒకసారి చూస్తే…
Also Read:హోమియో వైద్యం విషయంలో భయం అందుకేనా…?
భగవంతునికి ఇచ్చిన హారతి మనం కళ్లకు అద్దుకోవటం 100% సరైన విధానం అనే మాట వినపడుతుంది. ఆలయంలో భగవద్దర్శనంబాటు హారతి కళ్లకు అద్దుకోవటం, తీర్ధం స్వీకరించడం, శిరస్సుపై శఠగోపం తీసుకోవడం, కొంచెమైనా దేవుడికి నైవేద్యంగా చూపించిన ప్రసాదం స్వీకరించడం వంటివి యుగాలుగా మనకు వస్తున్న ఆచారాలు. ఇక హారతి కళ్ళకు అద్దుకోవడం కళ్ళకు మంచిది అనే మాట ఉంది.
Advertisement
కర్పూరంలో ఉండే ఘాటుసుగంధం సున్నితమైన మన కనురెప్పలపైన చేరిన సూక్ష్మజీవులను చంపేస్తుందని ఆయుర్వేద పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పే మాట. అసలు కర్పూరంలోనూ, హారతిలోనూ నరదృష్టి, దుష్టశక్తి (negative energy) ని దూరంచేసే అపురూపలక్షణాలు ఉంటాయనే వాళ్ళు ఉన్నారు. అయితే మరో మాట కూడా ఉంది.
Advertisements
స్వామి వారికి ఇచ్చేది ‘ మంగళ హారతి’ కాబట్టి ఆ హారతిని సాక్షాత్ దైవ స్వరూపం గా భావించి నమస్కరించుకోవాలి. ఆ హారతి వెలుగులోనే స్వామి వారిని పూర్ణంగా దర్శించి తన్మయత్వం చెందాలి గాని దిష్టి పరిహారంకోసం తీసే హారతులను కళ్ళకు అద్దుకోవడం మంచిది కాదు.
Advertisements