Advertisement
ప్రతి ఏటా అక్టోబర్ నెల వస్తుందంటే చాలు జనాలందరూ పండుగల కోసం సిద్ధమవుతుంటారు. ఏటా ఈ నెలలోనే దసరా పండుగ వస్తుంటుంది. తరువాత వెంటనే కొద్ది రోజులకు దీపావళిని జరుపుకుంటారు. దీంతో ఎక్కడ చూసినా పండుగ కోలాహలం నెలకొంటుంది. అయితే ఈసారి అధికమాసం కారణంగా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 17 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. అక్టోబర్ 26న దసరాను జరుపుకోనున్నారు.
అక్టోబర్ 17వ తేదీన ఉదయం 6.25 నుంచి 8.45 గంటల మధ్యలో కలశ స్థాపనకు సరైన ముహుర్తంగా నిర్ణయించారు. అయితే ఆ ముహుర్తం వీలుకాకపోతే ఉదయం 11.43 నుంచి మధ్యాహ్నం 12.29 గంటల మధ్య కూడా కలశాన్ని స్థాపించవచ్చు.
ఇక నవరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు అక్టోబర్ 24న ఉదయం 7 గంటలకు ముందుగా ఉపవాసం విడవాల్సి ఉంటుంది. అదే 9 రోజుల పాటు ఉపవాసం ఉండేవారు అయితే అక్టోబర్ 25న ఉదయం 7 గంటల లోపు ఉపవాసం విడిచిపెట్టాల్సి ఉంటుంది. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించే వారు అక్టోబర్ 25న వాటిని నిమజ్జనం చేయాల్సి ఉంటుంది.
అక్టోబర్ 13వ తేదీని పరమ ఏకాదశిగా భావించనున్నారు. అలాగే అక్టోబర్ 27వ తేదీని పాపాంకుశ ఏకాదశిగా భావించనున్నారు. ఆ రోజున విష్ణువు, శివుడిని పూజిస్తే భక్తులకు ఆయురారోగ్యాలు, సంపద కలుగుతాయని, వారు చనిపోయాక నేరుగా వైకుంఠానికి చేరుతారని చెబుతారు.
Advertisements
Advertisement
అక్టోబర్ 14, 28 తేదీలను ప్రదోష వ్రత దినాలుగా నిర్దారించారు. ఆయా రోజుల్లో శివపార్వతులకు పూజలు చేయాల్సి ఉంటుంది ఇక అక్టోబర్ నెలలో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన పండుగలు, ఇతర దినాల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
అక్టోబర్ 1 – గురువారం – అశ్విని నక్షత్రం, పౌర్ణమి
అక్టోబర్ 2 – శుక్రవారం – గాంధీ జయంతి
అక్టోబర్ 5 – సోమవారం – సంకష్ట చతుర్ధి
అక్టోబర్ 13 – మంగళవారం – పరమ ఏకాదశి
అక్టోబర్ 14 – బుధవారం – దోష వ్రతం
అక్టోబర్ 15 – గురువారం – మాస శివరాత్రి
అక్టోబర్ 16 – శుక్రవారం – అమావాస్య
అక్టోబర్ 17 – శనివారం – శరన్నవరాత్రి, అశ్విని శుక్ల ఆపాదం, ఘాత పురాణం, మాతా శైలాపుతి పూజ, తులా సంక్రాంతి
అక్టోబర్ 18 – ఆదివారం – ద్వైత్య, మాతా బ్రహ్మచారిణి పూజ
అక్టోబర్ 19 – సోమవారం – తృతీయ , మాతా చంద్రఘంట పూజ
అక్టోబర్ 20 – మంగళవారం – చతుర్ధి, మాతా కూష్మాండ పూజ
అక్టోబర్ 21 – బుధవారం – పంచమి, స్కందమాత పూజ
అక్టోబర్ 22 – గురువారం – షష్టి, సప్తమి, మాతా కాత్యాయని, మాతా కాళరాత్రి పూజ, నవపత్రిక పూజ
అక్టోబర్ 23 – శుక్రవారం – అష్టమి, మాతా మహాగౌరీ పూజ
అక్టోబర్ 24 – శనివారం – దుర్గా మహానవమి పూజ, మాతా సిద్ధిధాత్రి పూజ
అక్టోబర్ 25 – ఆదివారం – దశమి, నవరాత్రి, విజయదశమి, దుర్గా నిమజ్జనం
అక్టోబర్ 26 – సోమవారం – దుర్గా నిమజ్జనం
అక్టోబర్ 27 – మంగళవారం – పాపాంకుశ ఏకాదశి
అక్టోబర్ 28 – బుధవారం – దోష వ్రతం
అక్టోబర్ 30 – శుక్రవారం – కోజాగరి లక్ష్మీ పూజ, శరద్ పూర్ణిమ
అక్టోబర్ 31 – శనివారం – అశ్విని, పూర్ణిమ వ్రతం
Advertisements