Advertisement
ఇంట్లో ఉన్నా.. లేదా బయటకు వెళ్లినా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. సరే.. మనకు ఆపదలు అనేవి చెప్పి రావు. అనుకోకుండానే వస్తాయి. ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అందుకు ముందుగానే సిద్ధంగా ఉండాలి. అలా ఉంటే ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ప్రాణాలను నిలబెట్టుకోగలుగుతాం. అయితే అందుకు కింద తెలిపిన సూచనలు చక్కగా పనిచేస్తాయి. అవేమిటంటే…
Advertisement
1. ఎవరైనా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతే వారిని వెంటనే స్పృహలోకి వచ్చేలా చేయవచ్చు. అందుకు గాను చిత్రంలో చూపిన విధంగా వారిని వెల్లకిలా పడుకోబెట్టి, వారి రెండు కాళ్లను పట్టుకుని మోకాళ్లను ఛాతి మీదకు వంచాలి. దీంతో వారి మెదడుకు రక్త సరఫరా ఎక్కువగా జరుగుతుంది. ఈ క్రమంలో వారు స్పృహలోకి వస్తారు. అయితే శరీరం లేదా కాళ్లకు ఏవైనా గాయాలు తగిలిన సందర్భంలో ఇలా చేయరాదు. చేస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంటుంది. గాయాలు తగలని సందర్భంలోనే ఈ సూచనను పాటించాలి.
2. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో మీరు చిక్కుకుపోతే.. కారు డోర్లు ఓపెన్ కాకపోతే.. మీరు సులభంగా కారు అద్దాలను పగలగొట్టవచ్చు. అందుకు కారు అద్దాలను మధ్యలో కాకుండా చివరన పగలగొడితే అవి త్వరగా పగులుతాయి. అందుకు గాను అవసరం అయితే కారు హెడ్‌రెస్ట్‌లను కూడా తీసి ఉపయోగించవచ్చు. భిన్న రకాల కార్లలో హెడ్‌రెస్ట్‌లు భిన్నంగా ఉంటాయి. కనుక వాటిని ఎలా తీయాలో ముందుగానే తెలుసుకుంటే.. అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని వెంటనే తీసి కారు అద్దాలను పగలగొట్టేందుకు అవకాశం ఉంటుంది.
Advertisements