Advertisement
స్వాతంత్ర్యం తర్వాత ఇండియాలో 1952 లో మొదటిసారిగా జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. కాంగ్రెస్ నుండి ప్రధాని అభ్యర్థిగా నెహ్రూ ను ప్రకటించారు! నెహ్రూ కు వ్యతిరేఖంగా నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ….. ఏకే గోపాలన్ ను తమ పార్టీ నుండి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది!
మొత్తం 489 లోక్ సభా సీట్లలో కాంగ్రెస్ట్ పార్టీ 364 సీట్లను గెలుపొందింది. కమ్యూనిస్ట్ పార్టీ 16 సీట్లను మాత్రమే గెలుపొందింది! కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాని అభ్యర్థి అయిన ఏకే గోపాలన్ కేరళలోని కన్నూర్ లోక్ సభా స్థానం నుండి గెలుపొందారు!
Advertisement
మొదట గాంధీ గారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన గోపాల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అభ్యుదయ భావాలతో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో అటు తర్వాత ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి…..చాలా యాక్టివ్ గా పనిచేశారు. 5 సార్లు కన్నూర్ లోక సభా స్థానం నుండి ఎంపిగా గెలుపొందారు!
Advertisements
1962 ఇండియా-చైనా యుద్దానికి ముందు…..రెండు దేశాలు శాంతి ఒప్పందానికి రావాలని శాయశక్తుల ప్రయత్నించారు. కానీ ఇరు దేశాలు యుద్దానికే మొగ్గు చూపడంతో యుద్దం అనివార్యమైంది!ఈయన సేవలకు గానూ 1990 లో భారత ప్రభుత్వం గోపాలన్ పేరు మీద ఓ స్టాంప్ ను కూడా విడుదల చేసింది!
Advertisements